అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా దాదాపు 463 మిలియన్ల మంది డయాబెటిస్ రోగులున్నారు. ఒక్క దక్షిణాసియా (ఎస్‌ఇఎ)ప్రాంతంలో 88 మిలియన్ల బాధిఉతులుండగా, అందులో 77 మిలియన్ల మంది కేవలం మన దేశం నుంచే ఉన్నారని అంచనా. మరోవైపు దేశంలో అనారోగ్యం వల్ల సంభవిస్తున్న మరణాల్లో 2శాతం మరణాలకు డయాబెటిస్ ప్రధాన కారణం అవుతోంది. ఈ గణాంకాలు మన దేశంలో చక్కెర వ్యాధి మోగిస్తున్న ప్రమాద ఘంటికలకు అద్దం పడుతోంది. ఇప్పటి దాకా ఈ వ్యాధికి శాశ్వతమైన చికిత్స లేని నేపధ్యంలో డయాబెటిస్ రివర్సల్ ప్రోగ్రామ్ చాలా వరకు ఆ లోటును పూడుస్తోంది.
దీనికో ఉదాహరణ...
ఫెర్టిలిటీ చికిత్సలో భాగంగా నిర్వహించిన రొటీన్ వైద్య పరీక్షల సందర్భంగా ఏలూరుకు చెందిన శ్రీకి డయాబెటిస్ ఉందనే విషయం వెల్లడైంది. అతని రక్తంలో సగటు చక్కెర నిల్వలు 320 వరకున్నాయి. అనంతరం దీనికి సంబంధించి చేసిన వైద్య పరీక్షల్లో అతని కిడ్నీలు, కళ్లకు కూడా సమస్యలున్నట్టు స్పష్టమైంది. ఈ పరిస్థితుల్లో గత జూలైలో డయాబెటిస్ రివర్సల్ ప్రొసీజర్ అమలు చేశారు. దీంతో 5 నెలల్లో ఆయన రక్తంలోని చక్కెర స్థాయిలు సాధారణ స్థాయికి తగ్గిపోయాయి. డయాబెటిస్‌కి ఆ తర్వాత మందులు వాడాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. డయాబెటిస్ తగ్గుముఖం పట్టిన కారణంగా కిడ్నీసమస్య, కంటి చూపు సమస్య కూడా పరిష్కారమయ్యాయి.
టైప్ 2కి ఉపయుక్తం...
టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు దీర్ఘకాలిక పరిష్కారంగా పలు పరిశోధనల్లో నిరూపితమైన రివర్సల్ డయాబెటిస్‌ను వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అయితే ఇది దీర్ఘకాలంగా ఉండి, ఎక్కువ పరిమాణంలో ఇన్సులిన్ అవసరం పడుతున్నట్టయితే రివర్సల్ అవకాశాలు స్వల్పం. టైప్ 2 డయాబెటిస్ అయితే.. తొలి నాళ్లలో రివర్సల్‌ని ఎంచుకోవచ్చు. ఇది శాశ్వతమైన పరిష్కారమా అనే ప్రశ్నకు సమాధానం డయాబెటిస్ అనంతరం రోగి ఎంచుకున్న జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. గతంలో డయాబెటిస్ రావడానికి కారణమైన తరహా జీవనపు అలవాట్లకు రోగి తిరిగి మళ్లితే... మళ్లీ సమస్య తలెత్తే అవకాశం ఉంది. అయితే మంచి అలవాట్లను ఎంచుకుంటే మాత్రం దీర్ఘకాలం డయాబెటిస్ సమస్యలేని స్థితి కొనసాగించవచ్చు. ఏదేమైనా... ఇప్పుడు ఏ వ్యక్తి టైప్ 2 డయాబెటిస్ రోగిగా తేలినప్పుడు.. దీర్ఘకాలం మందుల వాడకానికి బదులుగా.. వెంటనే రివర్సల్‌కు వెళ్లడం సరైన పరిష్కారమే.
–డా. మురళీ కృష్ణ గంగూరి, కన్సల్టెంట్ డయాబెటిస్, ఎండోక్రనాలజీ
Comments
Please login to add a commentAdd a comment