ఇంతవరకు పురుషులకే సాయుధ సూట్ ఉంది. దాన్నే మహిళలు వినియోగించేవారు. అదీగాక సాయుధ విభాగంలో మహిళల సంఖ్య తక్కువగానే ఉండటంతో వారికి ప్రత్యేకంగా ఎలాంటి సాయుధ సూట్‌లు లేవు. అయితే ప్రపంచదేశాల దృష్టిని ఒక్కసారిగా తిప్పుకున్న సంగ్రామమే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఈ యుద్ధం యావత్తు ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసేలా ఇరు దేశాల మధ్య మొదలైంది.
ఎందరూ ఏవిధంగా చెప్పినా ఆంక్షలు విధించినా.. యుద్ధానికి సై అంటూ రష్యా అధ్యుకుడు వ్లాదిమర్ పుతిన్ ఉక్రెయిన్‌తో కయ్యానికి దిగాడు. చిన్న దేశంపై అంత ఆగ్రహం వలదన్నా.. అంగీకరించకపోగా..ఆ దేశంపై అణ్వాయుధ దాడికి దిగుతానని ప్రకోపించింది రష్యా. ఇంతటి విపత్కర స్థితిలో సైతం ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీకి మద్దతులగా ప్రజలు నిలిచారు. తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేస్తామని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆయుధాలను చేతబూని యుద్ధం చేసేందుకు రెడీ అయ్యారు. ఆ దేశ ప్రజల ధైర్య సాహసాలు, గుండె నిబ్బరం ప్రపంచ దేశాల్నీ కదిలించాయి. అంతేగాదు తాము సైతం సాయం చేస్తామని ఉక్రెయిన్ కోసం ముందుకొచ్చాయి.
ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక విషయమై ఉక్రెయిన్ వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలుస్తూనే ఉంది. ఇప్పుడూ తాజాగా మహిళ సైనికుల కోసం బుల్లెట్ ప్రూఫ్( రక్షణ కవచం) ప్రవేశపెట్టి మరోసారి వార్తల్లో నిలిచింది. ఉక్రెయిన్ యుద్ధంలో టీనేజ్ యువత తోపాటు మహిళలు కూడా మాతృదేశం కోసం తమ వంతుగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. పురుషుల ఫిజిక్‌కి తగ్గట్టుగా ఉన్న రక్షణ కవచమే స్త్రీలు కూడా ధరించాల్సి వచ్చేది.
వారికంటూ ప్రత్యేకంగా సాయుధ సూట్ లేదు. ఆ లోటును భర్తీ చేసింది ఉక్రెయిన్. వారు కూడా పురుషుల మాదిరిగా అనువుగా ఉండే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌లు ధరించేలా రూపొందించింది. దీన్ని వారు ఈజీగా తొలగించగలరు, ధరించగలిగేలా రూపొందించింది. అలాగే వారికెలాంటి ఇబ్బందిలేకుండా అనువుగా యుద్ధం చేసేలా ఉంటుందట. మహిళల మానవ శరీర నిర్మాణానికి అనుగుణంగా కవచం ఉండటమే గాక భూజం పట్టీలతో, సాయుధ లోడ్ బేరింగ్ బెల్ట్ కూడా ఉంటుంది.
యుద్ధంలో పాల్గొనే మహిళ శరీర సైజులకు అనుగుణంగా ఈ సాయుధ సూట్‌లు అందుబాటులో ఉంచింది. ఒక యుద్ధం తెలియకుండానే కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. యుద్ధం నష్టాన్నే గాక కొంగొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలకు మూలంగా మారుతుంది కూడా. 'అవసరం' ఎంతకైనా తెగించేలా చేస్తుంది. పైగా అదే ఆలోచనకు, ఆవిష్కరణలకు నాంది పలుకుంతుంది అంటే ఇదే కాబోలు.
Ukrainian women's armor
— maryam (@maryam321321) September 3, 2023
For the first time in Ukraine, a female armored suit is produced.
This armor cover is designed considering the anatomy and physiology of the female body and has a 500% increase in the level of protection against shrapnel, which significantly 1/2#war pic.twitter.com/MFmvCJqkdZ
Comments
Please login to add a commentAdd a comment