Women soldiers
-
త్రివిధ దళ ప్రతిభావంతుల ప్రథమ అడుగు
త్రివిధ దళ ప్రతిభావంతుల ప్రథమ అడుగు త్రివిధ దళాలలో మహిళా అధికారులకు సంబంధించి ఈ సంవత్సరంలో ఎన్నో ‘ప్రథమం’లు కనిపిస్తాయి. మహిళా సైనికులు ఆర్టిలరీ బ్రాంచిలలోకి అడుగుపెట్టారు. యుద్ధనౌకల కమిషనింగ్ బృందంలో భాగం అయ్యారు. అత్యంత కఠినమైన యుద్ధభూమి సియాచిన్లోకి వైద్యసేవల కోసం వెళ్లారు. భారత నావికాదళానికి చెందిన గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ‘ఐఎన్ఎస్’ ఇంఫాల్ మహిళా అధికారులు, నావికులతో ప్రత్యేక వసతులతో కూడిన తొలి యుద్ధనౌకగా అవతరించింది, నావికా, వైమానిక దళాలు తమ ఆపరేషన్లకు సంబంధించిన ప్రతి విభాగం లోకి మహిళలను అనుమతిస్తున్నాయి. ఇంతకాలం పురుషులు మాత్రమే నాయకత్వ స్థానంలో ఉండే విభాగాలలో ఈ సంవత్సరం మహిళా అధికారులు నాయకత్వ స్థానాల్లోకి వచ్చారు.... ► హరియాణాలోని జింద్ జిల్లాకు చెందిన చెందిన పాయల్ చబ్ర ఎంబీబీఎస్, ఎంఎస్ చేసింది. అంబాలా కంటోన్మెంట్ని ఆర్మీ హాస్పిటల్, లడఖ్‌లోని ఖర్దుంగ్లా ఆర్మీ హాస్పిటల్లో పనిచేసింది. ఆ తరువాత లడఖ్‌లోని ఆర్మీ హాస్పిటల్లో సర్జన్‌గా పనిచేసింది. ఒకవైపు సర్జన్‌గా పనిచేస్తూనే మరోవైపు పారో కమాండో కావడానికి ఆగ్రాలోని పారాట్రూపర్స్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందింది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తరువాత పారా మిలిటరీ ప్రత్యేక భద్రతా దళంలో చేరిన తొలి మహిళా ఆర్మీ సర్జన్‌గా ప్రత్యేకత సాధించింది. ►ముంబాయికి చెందిన ప్రేరణ దేవస్థలీ సెయింట్ జేవియర్స్ కాలేజీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. 2009లో భారత నావికా దళంలో చేరింది. పశ్చిమ నౌకాదళానికి చెందిన పెట్రోలింగ్ నౌక ‘ఐఎన్ఎస్ త్రిన్కాత్’ ఫస్ట్ ఫిమేల్ కమాండింగ్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది. ప్రేరణ సోదరుడు ఇండియన్ నేవీలో పనిచేస్తాడు. అతడి స్ఫూర్తితోనే నావికాదళంలోకి వచ్చింది ప్రేరణ. ‘భారత నౌకాదళం అవకాశాల సముద్రం. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా మనల్ని మనం నిరూపించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి’ అంటుంది ప్రేరణ. ► దిల్లీ కంటోన్మెంట్‌లోని భారత సైన్యానికి చెందిన రక్తమార్పిడి కేంద్రం(ఎఎఫ్టీసీ) ఫస్ట్ ఉమెన్ కమాండింగ్ ఆఫీసర్‌గా ప్రత్యేకత చాటుకుంది కల్నల్ సునీతా బీఎస్. రోహ్తక్ మెడికల్ కాలేజీలో ‘పాథాలజీ’లో పీజీ చేసిన సునీత అరుణాచల్‌ప్రదేశ్‌లో మిలిటరీ ఆస్పత్రిలో కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేసింది. ► ‘ఫ్రంట్‌లైన్ ఐఏఎఫ్ కంబాట్ యూనిట్’ కమాండర్ బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళ షాలిజా ధామి. 2003లో హెలికాప్టర్ పైలట్ అయింది. 2,800 గంటలకు పైగా విమానాన్ని నడిపిన అనుభవం ఆమె సొంతం. వెస్ట్రన్ సెక్టార్‌లోని హెలికాప్టర్ యూనిట్లో ఫ్లైట్ కమాండర్‌గా పనిచేసింది. పంజాబ్‌లోని లూథియానా థామి స్వస్థలం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసింది. భారత వైమానిక దళంలో శాశ్వత కమిషన్‌ను పొందిన మొదటి మహిళా అధికారిగా నిలిచింది. ► తూర్పు లడఖ్‌లో భారత్–చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ‘స్వతంత్ర ఫీల్డ్ వర్క్‌షాప్’కు పురుష అధికారులు మాత్రమే నాయకత్వ స్థానంలో ఉండేవారు. ఈ ఏడాది ఆ అవకాశం గీతా రాణాకు వచ్చింది. స్వతంత్ర ఫీల్డ్ వర్క్‌షాప్‌కు కమాండ్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళా అధికారిగా గీతా రాణా ప్రత్యేకత నిలుపుకుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్(ఈఎంఈ) ట్రైనింగ్ సెంటర్లో ఇన్‌స్ట్రక్టర్‌గా బాధత్యలు నిర్వహించింది గీతా రాణా. ► స్క్వాడ్రన్ లీడర్ మనిషా పధి మిజోరం గవర్నర్ సహాయకురాలి (ఏడీసీ)గా నియామకం అయింది. మన దేశంలో గవర్నర్‌కు ఎయిడ్–డి–క్యాంప్(ఏడీసీ)గా నియామకం అయినా ఫస్ట్ ఉమన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది. మనిషా స్వస్థలం ఒడిషా రాష్ట్రంలోని బెర్హంపూర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్–బీదర్, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్–పుణె చివరగా భటిండాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో పనిచేసింది. ► ప్రపంచంలో అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్. వైద్యసేవలు అందించడానికి ఈ ప్రమాదకరమైన యుద్ధక్షేత్రంలోకి అడుగు పెట్టిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్ (ఆపరేషనల్ పోస్ట్)గా ప్రత్యేకత చాటుకుంది కెప్టెన్ ఫాతిమా వసిమ్. దీనికిముందు ‘సియాచిన్ బ్యాటిల్ స్కూల్’లో ఎన్నో నెలల పాటు కఠోరమైన శిక్షణ తీసుకుంది. (చదవండి: కొత్త సంవత్సరమా మనిషిని మేల్కొలుపు) -
తొలిసారిగా మహిళా సైనికుల కోసం బుల్లెట్ ప్రూఫ్!
ఇంతవరకు పురుషులకే సాయుధ సూట్ ఉంది. దాన్నే మహిళలు వినియోగించేవారు. అదీగాక సాయుధ విభాగంలో మహిళల సంఖ్య తక్కువగానే ఉండటంతో వారికి ప్రత్యేకంగా ఎలాంటి సాయుధ సూట్లు లేవు. అయితే ప్రపంచదేశాల దృష్టిని ఒక్కసారిగా తిప్పుకున్న సంగ్రామమే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఈ యుద్ధం యావత్తు ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసేలా ఇరు దేశాల మధ్య మొదలైంది. ఎందరూ ఏవిధంగా చెప్పినా ఆంక్షలు విధించినా.. యుద్ధానికి సై అంటూ రష్యా అధ్యుకుడు వ్లాదిమర్ పుతిన్ ఉక్రెయిన్‌తో కయ్యానికి దిగాడు. చిన్న దేశంపై అంత ఆగ్రహం వలదన్నా.. అంగీకరించకపోగా..ఆ దేశంపై అణ్వాయుధ దాడికి దిగుతానని ప్రకోపించింది రష్యా. ఇంతటి విపత్కర స్థితిలో సైతం ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీకి మద్దతులగా ప్రజలు నిలిచారు. తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేస్తామని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆయుధాలను చేతబూని యుద్ధం చేసేందుకు రెడీ అయ్యారు. ఆ దేశ ప్రజల ధైర్య సాహసాలు, గుండె నిబ్బరం ప్రపంచ దేశాల్నీ కదిలించాయి. అంతేగాదు తాము సైతం సాయం చేస్తామని ఉక్రెయిన్ కోసం ముందుకొచ్చాయి. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక విషయమై ఉక్రెయిన్ వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలుస్తూనే ఉంది. ఇప్పుడూ తాజాగా మహిళ సైనికుల కోసం బుల్లెట్ ప్రూఫ్( రక్షణ కవచం) ప్రవేశపెట్టి మరోసారి వార్తల్లో నిలిచింది. ఉక్రెయిన్ యుద్ధంలో టీనేజ్ యువత తోపాటు మహిళలు కూడా మాతృదేశం కోసం తమ వంతుగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. పురుషుల ఫిజిక్‌కి తగ్గట్టుగా ఉన్న రక్షణ కవచమే స్త్రీలు కూడా ధరించాల్సి వచ్చేది. వారికంటూ ప్రత్యేకంగా సాయుధ సూట్ లేదు. ఆ లోటును భర్తీ చేసింది ఉక్రెయిన్. వారు కూడా పురుషుల మాదిరిగా అనువుగా ఉండే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించేలా రూపొందించింది. దీన్ని వారు ఈజీగా తొలగించగలరు, ధరించగలిగేలా రూపొందించింది. అలాగే వారికెలాంటి ఇబ్బందిలేకుండా అనువుగా యుద్ధం చేసేలా ఉంటుందట. మహిళల మానవ శరీర నిర్మాణానికి అనుగుణంగా కవచం ఉండటమే గాక భూజం పట్టీలతో, సాయుధ లోడ్ బేరింగ్ బెల్ట్ కూడా ఉంటుంది. యుద్ధంలో పాల్గొనే మహిళ శరీర సైజులకు అనుగుణంగా ఈ సాయుధ సూట్లు అందుబాటులో ఉంచింది. ఒక యుద్ధం తెలియకుండానే కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. యుద్ధం నష్టాన్నే గాక కొంగొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలకు మూలంగా మారుతుంది కూడా. 'అవసరం' ఎంతకైనా తెగించేలా చేస్తుంది. పైగా అదే ఆలోచనకు, ఆవిష్కరణలకు నాంది పలుకుంతుంది అంటే ఇదే కాబోలు. Ukrainian women's armor For the first time in Ukraine, a female armored suit is produced. This armor cover is designed considering the anatomy and physiology of the female body and has a 500% increase in the level of protection against shrapnel, which significantly 1/2#war pic.twitter.com/MFmvCJqkdZ — maryam (@maryam321321) September 3, 2023 (చదవండి: "విమానాన్నే ఇల్లుగా మార్చేశాడు"..అందుకోసం ఏకంగా..) -
Womens empowerment: ఉక్కు దళం
ఇండియా–బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం... పచ్చని అడవి... చల్లని నది ప్రశాంతంగా కనిపిస్తాయి. అయితే చాప కింద నీరులా సంఘవిద్రోహశక్తులు వికటాట్టహాసం చేస్తుంటాయి. తమకు ఎదురు లేదని కొమ్ములు విసురుతుంటాయి. సంఘవిద్రోహశక్తుల అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడానికి ‘ఓన్లీ ఉమెన్’ దళం రంగంలోకి దిగింది. స్త్రీ సాధికారతకు పట్టం కట్టేలా బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)లో మరో అడుగు పడింది. తాజాగా ఇండియా–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ మహిళా జవాన్లు విధులు నిర్వహించనున్నారు. ప్రసిద్ధ సుందర్ బన్ అడవుల్లో కొంత భాగం మన దేశంలో, కొంత భాగం బంగ్లాదేశ్‌లో విస్తరించి ఉంది. సరిహద్దును ఆనుకొని ఉన్న అడవులు, చిన్న దీవులు, నదులు అనేవి సంఘ విద్రోహశక్తులకు అడ్డాగా మారాయి. ఈ నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ అవసరం అయింది. దీనికోసం బీఎస్ఎఫ్ సట్లెజ్, నర్మద, కావేరి, సబర్మతి, క్రిష్ణ, గంగ పేర్లతో బీవోపి (బార్డర్ ఔట్ పోస్ట్) లను ఏర్పాటు చేసింది. ‘బీవోపి’కి చెందిన ‘గంగ’ మహిళా జవానులు తొలిసారిగా సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన నిఘా విధులలో భాగం అవుతున్నారు. మనుషుల అక్రమ చొరబాటు, స్మగ్లింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు దొంగల నుంచి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి జాలర్లను రక్షించే బాధ్యతలు కూడా ‘బీవోపి–గంగ’పై ఉన్నాయి. స్థానిక పోలీసులు, అటవీశాఖ అధికారులు, స్థానిక ప్రజలను సమన్వయం చేసుకుంటూ అటవీ ప్రాంతాలకు నష్టం జరగకుండా చూడాల్సి ఉంటుంది. ‘బీవోపి–గంగ’కు ఉపయోగించే మోటర్ బోట్‌ను కొచ్చిలో తయారుచేశారు. దీనిలో 35 మంది జవాన్లకు చోటు ఉంటుంది. అత్యాధునిక రాడార్, కమ్యూనికేషన్ సదుపాయాలు ఉన్నాయి. ‘బీవోపీ–గంగ తన సత్తా చాటబోతోంది. పోరాట పటిమ ప్రదర్శించబోతోంది. స్మగ్లింగ్ కార్యకలాపాల్లో కొందరు స్త్రీలు కూడా భాగం అవుతున్నారు. ఇకముందు వారిని అదుపులోకి తీసుకోవడం సులభం అవుతుంది’ అంటున్నారు సౌత్ బెంగాల్ ఫ్రంటియర్ బీఎస్ఎఫ్ డిఐజీ అమ్రిష్ ఆర్యా. -
Ukraine War: కన్నపేగు బంధం.. వీడియోలు చూస్తే కన్నీరు ఆగదు!
కీవ్: యుద్ధంలో పాల్గొనడమంటే మృత్యువుకు ఎదురెళ్లడమే. కదన రంగంలోకి అడుగుపెట్టాక ప్రాణాలతో ఇంటికి తిరిగి వెళ్తామనే గ్యారంటీ ఉండదు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ సైనికులు కొన్ని నెలలుగా పోరాడుతున్నారు. ముఖ్యంగా మహిళా సైనికులు తమ బిడ్డలు, కుటుంబాన్ని వదిలి శత్రువులను నిలువరిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి కాస్త శాంతిచడం వల్ల కొందరు తిరిగి ఇళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆరేళ్ల చిన్నారి చాలా రోజుల తర్వాత తన తల్లి ఇంటికి రావడం చూసి భావోద్వేగానికి లోనయ్యాడు. ఇంటి గేటు వద్దే గోడ చాటున ఆమె కోసం ఎదురు చూశాడు. తీరా తల్లిని చూసిన ఆనందంలో ఏం చేయాలో కూడా అతనికి పాలుపోలేదు. తల్లి చిన్నారిని దగ్గరగా హగ్ చేసుకున్న ఈ వీడియోను ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ సలహాదారు ఆంటోన్ గెరాష్చెన్కో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఉక్రెయిన్ ఇప్పుడు పోరాడుతోందని దీనికోసమే అన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చలించిపోయారు. This is what we're fighting for. pic.twitter.com/nX6Lxd3sN6 — Anton Gerashchenko (@Gerashchenko_en) July 19, 2022 ఈ వీడియోలో పెంపుడు కుక్క కూడా చాలా రోజుల తర్వాత మహిళా సోల్జర్ను చూసి తెగ సంబరపడిపోయింది. దానికి కూడా ఒక హగ్ ఇవ్వాల్సింది అని ఓ నెటిజెన్ కామెంట్ పెట్టాడు. మరో వీడియోలో యుద్ధం నుంచి తిరిగి వచ్చిన తండ్రిని చూపించేందుకు ఓ బాలికను కళ్లు మూసి అతని వద్దకు తీసుకెళ్లింది తల్లి. చాలా రోజుల తర్వాత తండ్రిని చూసిన ఆ పాప భావోద్వేగంతో కంటతడి పెట్టుకుంది. తండ్రి కూడా ఆమెను చూసి పట్టరాని ఆనందంలో మునిగిపోయాడు. Daddy came home from war - 2. pic.twitter.com/iOZORtnUSL — Anton Gerashchenko (@Gerashchenko_en) July 9, 2022 చదవండి: రోజుకు రూ.15 వేలు సంపాదిస్తున్నా.. ఏం చేసినా ఇంత డబ్బు రాదు.. అందుకే! -
10 మంది మహిళా సైనికులు సముద్రంలో 7 రోజులు
మనం నేల మీద మన రోజువారీ వ్యవహారాలు చూసుకుంటూ ఉండగా ఇటీవల నీటి మీద ఒక సాహసం జరిగింది. బంగాళాఖాతంలో పది మంది మహిళా ఆర్మీ ఆఫీసర్లు ఒక్క పురుషుడి తోడు కూడా లేకుండా చిన్న యాట్ (తెరచాపతో నడిచే చిన్న పడవ)లో చెన్నై నుంచి విశాఖపట్నంకు తిరిగి విశాఖపట్నం నుంచి చెన్నైకు 7 రోజుల్లో సాహస యాత్ర చేశారు. ఫిబ్రవరి 15న చెన్నైలో బయలుదేరిన ఈ యాత్ర ఫిబ్రవరి 23న ముగిసింది. ‘నిజానికి మా యాత్ర 4 రోజుల్లో ముగుస్తుంది అనుకున్నాం. కాని సముద్రం లెక్క సముద్రానికి ఉంటుంది. అలలు, గాలులు మనం ఎప్పుడు గమ్యం చేరాలో నిర్దేశిస్తాయి. అందుకే 7 రోజులు పట్టింది’ అంది ఈ బృందానికి కెప్టెన్‌గా వ్యవహరించిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముక్త శ్రీ గౌతమ్. ‘ఆర్మీ అడ్వంచర్ వింగ్’ ఆధ్వర్యంలో ‘ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సెయిలింగ్ అసోసియేషన్’ నిర్వహణలో ఈ సాహస యాత్ర జరిగింది. ఈ యాత్రలో ఆర్మీ నుంచి ఎంపిక చేసిన 10 మంది మహిళా ఆఫీసర్లను ఎంపిక చేశారు. కెప్టెన్ ముక్త శ్రీ గౌతమ్ కాకుండా మేజర్ సంజనా మిట్టల్, మేజర్ అర్పితా ద్వివేది, కెప్టెన్ మాళవికా రావత్, కెప్టెన్ శుభమ్ సోలంకి, మేజర్ ప్రియా సంవాల్, మేజర్ ప్రియా దాస్, కెప్టెన్ జ్యోతి సింగ్, మేజర్ రష్మిల్, కెప్టెన్ సోనాల్ గోయల్ ఉన్నారు. ‘నేటి మహిళలు స్త్రీల పట్ల మన దేశంలో ఉన్న మూస అభిప్రాయాలను బద్దలు కొడుతున్నారు. వారు ధైర్యానికి కొత్త ప్రమాణాలు లిఖిస్తున్నారు’ అని చెన్నైలో జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. నిజమే. ఈ పదిమంది అలాంటి ధైర్యం చూపారు. ‘మాలో ఎక్కువమందికి ఇదే తొలి నౌకాయానం. కాని మాలో ఏదైనా సాహసం చేయాలన్న కోరిక ఎక్కువ. అందుకే ఈ యాత్రకు సై అన్నాం. మాకు 25 రోజులు ముంబైలోని మార్వెలో శిక్షణ ఇచ్చారు. అక్కడ పడవల గురించి, నౌకాయానం గురించి, సముద్రపు అలల గురించి తెలియ చేశారు. ఆ తర్వాత చెన్నైలో మేము ఏ యాట్ మీద అయితే ప్రయాణించాలో దాని మీద 10 రోజుల శిక్షణ ఇచ్చారు. కాని తీరంలో శిక్షణ వేరు. నిజమైన సముద్ర ప్రయాణం వేరు అని యాత్ర మొదలయ్యాక అర్థమైంది’ అంటారు ఈ బృంద సభ్యులు. చెన్నైలో ఫిబ్రవరి 15న బయలుదేరిన ఈ బృందం 330 నాటికల్ మైళ్లు (611 కి.మీ) ప్రయాణించి 54 గంటల్లో ఫిబ్రవరి 17న విశాఖ చేరుకుంది. అక్కడ యాట్‌ను ఒకసారి చెక్ చేసుకుని తిరిగి 18న బయలుదేరి 23న చెన్నై చేరుకున్నారు. వచ్చే సమయం కన్నా వెళ్లే సమయం ఎక్కువ పట్టింది. ‘కాకినాడ–కృష్ణపట్నం మధ్యలో ఉండే నూనె బావులను, చేపల వలల్ని తప్పించుకునేందుకు మేము బాగా సముద్రం లోపలికి వెళ్లాం. మా యాత్రలో ఒక పౌర్ణమి రాత్రి ఉంది. ఆ రాత్రంతా తీవ్రంగా ఉన్న సముద్ర అలలపై ప్రయాణం సవాలుగా మారింది’ అంది మేజర్ ముక్త. ఆమెది రాజస్థాన్. సముద్రమే లేని ప్రాంతం నుంచి సముద్రాన్ని ఈ యాత్రతో గెలిచింది. అయితే ఇదంతా సులభం కాదు. 44 అడుగుల పొడవు మాత్రమే ఉండే ఈ యాట్‌లో 150 చదరపు అడుగుల కేబిన్ ఉంటుంది. ఈ కేబిన్‌లోనే కిచెన్, టాయిలెట్లు, రెస్ట్ ప్లేస్ ఉంటాయి. పనిని బృందాలుగా విభజించుకుని ఒక బృందం డ్యూటీ దిగితే మరో బృందం డ్యూటీ ఎక్కితే డ్యూటీ దిగిన బృందం నిద్రకు ఉపక్రమించవచ్చు. కానీ అలల తాకిడికి కదిలే యాట్‌లో నిద్ర అంత సులభం కాదు. అయినా బృంద సభ్యులు లెక్క చేయలేదు. ‘మా యాత్రలో పెద్ద పెద్ద సముద్ర తాబేళ్లు చూశాం. ఒక డాల్ఫిన్ల గుంపు మా వెనుక చాలాసేపు వచ్చింది. అద్భుతం’ అంటారు మేజర్ ప్రియా దాస్. భారత నేవీ, తీర ప్రాంత గస్తీ దళాలు వీరి యాత్ర సాగినంత మేర వీరి యాట్‌ను ట్రాక్ చేస్తూ సాంకేతిక సహకారాన్ని అందించాయి. ‘నేను కేన్వాస్ మీద ప్రతిసారీ నీలి రంగును చిత్రించేదాన్ని. ఈ యాత్రతో జీవితకాలపు నీలిమను నేను గుండెల్లో నింపుకున్నాను’ అంది ప్రియా దాస్. స్త్రీలు నౌకాయానంలో రాణించాలని, సెయిలింగ్ క్రీడలో భాగస్వామ్యం తీసుకోవాలని వారికి సందేశం ఇవ్వడానికి ఈ యాత్ర చేశారు వీరంతా. 7500 కిలోమీటర్ల మేర తీరం ఉన్న మన దేశంలో నౌకాయానం వల్ల స్త్రీలు ఎంతో ఉపాధి పొందవచ్చు అని ఆలోచిస్తే ఈ సాహస యాత్ర పూర్తిగా విజయవంతమైనట్టే. -
సైన్యంలో పురుషాధిక్యతకు పగ్గాలు!
వైద్యం కోసం కాకుండా... షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆర్మీలోకి మహిళలు మొట్టమొదట ప్రవేశించి 30 సంవ త్సరాలు అవుతోంది. 1992లో తొలి మహిళా ఆర్మీ ఆఫీసర్లు సర్వీసులోకి అడుగుపెట్టారు. అలా మొదలై ఈ దేశపు మహిళలు దేశ రక్షణ రంగంలో బలంగా కాలుమోపేందుకు... న్యాయమైన తమ హక్కులను సాధించుకునేందుకు ఇప్పుడు వీలు పడింది. అంటే, ఇంత సమయం కావాల్సి వచ్చిందన్న మాట. సుప్రీం కోర్టు గత ఏడాది ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు పుణ్యమా అని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) తలుపులు ఇప్పుడు మహిళలకూ బార్లా తెరుచుకున్నాయి. ఎన్డీఏలో సీట్ల కోసమే కాకుండా... ఆర్మీ తదితర సర్వీసుల్లోనూ పర్మనెంట్ కమిషన్ కోసమూ ఇప్పుడు మహిళలు పోటీ పడవచ్చు. యుద్ధరంగంలోనూ దిగేందుకు మార్గం సుగమ మైంది. ఈ జనవరి 15వ తేదీ నిర్వహించిన ఆర్మీ డే నిజంగా సంబరాలు చేసుకోవాల్సిన దినమే. త్రివిధ దళాల్లో మహిళల పాత్ర పెరిగే దిశగా ఇంకో ముందడుగు వేశాం మరి! నిజానికి సైనిక బలగాల కూర్పులో గుణాత్మక, పరిమా ణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడం ఈ రోజు ఉన్న పరి స్థితులకు చాలా అవసరం కూడా! లీగల్, ఎడ్యుకేషన్ కోర్లతో పాటు 2008 నుంచి మహిళలు పర్మినెంట్ కమిషన్ ఆఫీసర్లుగా నియమితులవుతున్నా, 2020 నుంచి ఇది ఇంకో ఎనిమిది యుద్ధేతర రంగాలకు విస్తరించినా, మహిళల భాగస్వామ్యం పెద్దగా పెరిగిందేమీ లేదు. ఇండియన్ ఆర్మీలో వైద్య సేవల విభాగాన్ని మినహాయిస్తే 2020 నాటికి మహిళల శాతం కేవలం మూడు మాత్రమే. అగ్రరాజ్యం అమెరికాలో ఇది 16 శాతం వరకూ ఉంటే, ఫ్రాన్స్‌లో 15 శాతం, రష్యా, బ్రిటన్లలో పది శాతం వరకూ ఉంది. ఆర్మీలో మహిళల భాగస్వామ్యం పెరగడం చాలా రకా లుగా ప్రయోజనకరం. ముందుగా చెప్పుకోవాల్సింది ఆఫీసర్ల కొరత! ఆర్మీలో 7,476 మంది ఆఫీసర్ల కొరత ఉందని నెల రోజుల క్రితం దేశ రక్షణ శాఖ సహాయ మంత్రి స్వయంగా రాజ్యసభలో తెలిపారు. యువత ఆర్మీలో చేరేందుకు కొంత విముఖత చూపుతూండటం ఈ కొరతకు కారణం. గతంలో మాదిరిగా ఆర్మీ అధికారుల సంతానం కూడా సర్వీసుల్లోకి చేరడం తగ్గిపోతోంది. కొన్ని దశాబ్దాలుగా వీరు ఇతర కార్పొరేట్ ఉద్యోగాల్లోకి చేరిపోతున్నారు. అయితే ఇప్పుడు ఆడపిల్లలకూ పర్మనెంట్ కమిషన్ లభించే అవకాశం ఏర్పడినందున చాలామంది ఆఫీసర్ల కుమార్తెలు ఈ వృత్తిని ఎంచుకునే అవకాశాలున్నాయి. ఈ మార్పుతో ఆర్మీలో చిలిపి తనం పేర ఇప్పటివరకూ కొనసాగుతూ వస్తున్న పురుషాధిక్య భావజాలం కూడా కొంతమేరకైనా తగ్గే అవకాశం ఉంది. కొన్నేళ్ల క్రితం ఓ ఆర్మీ ఉన్నతాధికారిని ఇంటర్వ్యూ చేసిన ప్పుడు ఆర్మీలోకి మహిళలు చేరడంపై పరోక్షంగా తన అభిప్రా యాలను ఆయన కుండబద్దలు కొట్టాడు. ఒకానొక సంద ర్భంలో వేరెవరూ లేకుండా ఒక పురుష, మహిళ ఆర్మీ అధికారులిద్దరే బేస్ క్యాంప్‌లో ఉండాల్సిన పరిస్థితిని తాను ఉద్దేశపూర్వకంగా తప్పించానని చెప్పుకొచ్చాడు. కొంత కాలం తరువాత ఈ విషయం ఆ మహిళా ఆఫీసర్‌కు తెలిసి, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందట. అయితే దాని ప్రభావం ఈ ఆర్మీ ఆఫీసర్‌పై ఏమీ పడలేదు. ఉన్నతాధికారి చర్య తనపై ఆయనకున్న అపనమ్మకానికి ప్రతీక అని మహిళా అధికారి వాపోయింది. కానీ ఆర్మీ నైతిక విలువలకు ఇదో తార్కాణమని ఆ ఉన్నతాధికారి తన చర్యను సమర్థించుకున్నాడు. 2020 ఫిబ్రవరిలో పురుషులతో సమానంగా మహిళలకూ కమాండ్ స్థానాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్పుడు, మహిళలకు అలాంటి పాత్రలు ఇవ్వడంపై మిలటరీ వ్యక్తం చేసిన అభ్యంతరాలన్నింటికీ చెక్ పెట్టినట్లు అయ్యింది. ఆదేశాలు జారీ చేసే స్థానాన్ని మహిళలకు ఇవ్వడం ఆచరణ లోనూ, సంస్కృతీ సంప్రదాయల పరంగానూ సరికాదన్న అభ్యంతరం దుర్విచక్షణతో కూడినదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏది ఏమైతేనేం. మహిళలు ఇప్పుడు యుద్ధ రంగం లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈలోపు వారు మరి కొన్ని అడ్డంకులను అధిగమించాల్సి ఉంది. ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే ఇటీవల ఎన్డీఏ పెరేడ్‌ను సమీక్షిస్తూ చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి. ఆర్మీలో మహిళల ప్రవేశా నికి సంబంధించి సుప్రీం తీర్పును ఆయన శ్లాఘించారు. ఆర్మీలో లింగ సమానత్వానికి ఇది దారి తీస్తుందని స్పష్టం చేశారు. ‘‘ఇంకో 40 ఏళ్ల తర్వాతైనా.. వాళ్లు ఇప్పుడు నేనున్న స్థానంలో ఉంటారు’’ అని నరవాణే వ్యాఖ్యానించడం స్త్రీలకు భరోసానిచ్చే విషయమే. ఆర్మీ చీఫ్ స్థానానికి ఒక మహిళ ఎదిగేందుకు మరో నలభై ఏళ్లు పడుతుందో, లేదో చెప్పలేము కానీ.. ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన నేను మాత్రం నాలుగేళ్ల తర్వాత ఎన్డీఏ పాసింగ్ అవుట్ పెరేడ్‌ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని మాత్రం చెప్పగలను. పురుషు లతో సమానంగా యుద్ధరంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్న మహిళ ఆర్మీ ఆఫీసర్ల కళ్లల్లో రేపటిపై విశ్వాసం, భుజ స్కంధాలపై ఆర్మీ చిహ్నాలు చూడడం గర్వకారణం కూడా! – సునందా మెహతా, రచయిత్రి, పాత్రికేయురాలు (ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో) -
ఆర్మీ: నెయిల్ పాలిష్, పోనిటెయిల్‌కు ఓకే
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్.. అగ్రరాజ్య సైన్యానికి సంబంధించి పలు కీలక మార్పులకు ఆమోదం తెలిపారు. సైన్యంలో మహిళా సైనికుల వస్త్రధారణకు సంబంధించి కొన్ని నియమాల్లో కీలక మార్పులు చేశారు. ఇక మీదట అమెరికన్ సైన్యంలోని మహిళా సైనికులు షార్ట్ పోనిటెయిల్ వేసుకోవడానికి.. లిప్‌స్టిక్ పెట్టుకోవడానికి అనుమతించారు. అలానే మగ సైనికులు స్పష్టమైన రంగుల నెయిల్ పాలిష్ ధరించవచ్చని తెలిపారు. ఇక బిడ్డకు పాలిచ్చే మహిళా సైనికులు వస్త్రధారణకు సంబంధించి పలు సడలింపులు ఇచ్చారు. బ్రెస్ట్ ఫీడింగ్, పంపింగ్ ద్వారా బిడ్డకు పాలిచ్చే తల్లులు ప్రస్తుత వస్త్రధారణ ప్రమాణాలకు అదనంగా లోపల మరో వస్త్రం ధరించేందుకు అనుమతిచ్చారు. ఈ నూతన మార్పులు ఫిబ్రవరి 25 నుంచి అమల్లోకి రానున్నాయి అని తెలిపారు. ప్రస్తుత మార్పులు అమెరికా సైన్యంలో చేరే మహిళల సంఖ్యను పెంచుతాయని.. అంతేకాక ప్రస్తుతం ఉన్న మహిళా సైనికులపై అసమాన ప్రభావాన్ని చూపుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: బైడెన్ వలస చట్టంపై హోరాహోరీ ) మాజీ డిఫెన్స్ సెక్రటరీ మార్క్ ఎస్పర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రివ్యూ కమిటీ సూచనల ఫలితమే ఈ మార్పులు. ఈ కమిటీ మిలటరీలో జాతివివక్ష, మైనారిటీలపై అధికార దుర్వినియోగం వంటి పలు అంశాల పరిశీలనకు ఉద్దేశించబడింది. గతంలో అమెరికా సైన్యంలోని మహిళలు పొడవాటి జుట్టును బన్(కొప్పు)లా కట్టుకోవాల్సి వచ్చేది. ఇది అసౌకర్యంగా ఉండటమే కాక.. హెల్మెట్ ధరించడంలో ఇబ్బంది కలిగేది. ఇక తాజా సవరణలతో ఈ సమస్యలు తొలగిపోనున్నాయి. ఈ సందర్భంగా ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ గ్యారీ బిట్రో మాట్లాడుతూ.. ‘‘మా విధానాలను నిరంతరం పరిశీలించుకుంటూ.. అవసరమైన చోట మార్పులు చేసుకుంటూ.. ముందుకు సాగుతున్నాం. ఇక మేం అవలించే విధానాల వల్ల సైన్యంలోని సైనికులందరు మాకు ఎంత విలువైన వారో.. వారి పట్ల మాకు ఎంత నిబద్ధత ఉందో వెల్లడవుతుంది. మా ర్యాంకుల్లో చేరిక, ఈక్విటీ వంటి అంశాల్లో.. మాటల కంటే చేతలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని ఈ రోజు మేం మరోసారి నిరూపించాం. మేం ప్రకటించిన ఈ మార్పులు మన ప్రజలను మొదటి స్థానంలో ఉంచే విధానాలకు ఒక ఉదాహరణ అని మేం నమ్ముతున్నాం’’ అన్నారు. (చదవండి: అంతా ఒక్కటే.. నో ఆడ, నో మగ, నో ట్రాన్స్‌జెండర్) The #USArmy has revised Army Regulation 670-1, Wear and Appearance of Army Uniforms and Insignia. The updates will be effective Feb. 25, 2021 and directly supports the Army’s diversity and inclusion efforts. Learn more in this STAND-TO! ➡️ https://t.co/Y2VlaZgQHr#ArmyLife pic.twitter.com/4y9e7hBJ5a — U.S. Army (@USArmy) January 27, 2021 ఇక ఆర్మీలో చేసిన ఈ మార్పులు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మగ వారికి నెయిల్ పాలిషా.. వ్వాటే జోక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక అమెరికా వాయు సేన తన విభాగంలో పని చేస్తున్న మహిళా సైనికుల హెయిర్ స్టైల్ విషయంలో పలు మార్పులు చేసిన వారం రోజుల తర్వాత మిలిటరీ ఈ నూతన మార్పులు ప్రకటించింది. ఇక ఇదే కాక బైడెన్ లింగమార్పిడి వ్యక్తులను సైన్యంలోకి నిషేధిస్తూ.. ట్రంప్ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. అంతేకాక ‘‘దేశానికి సేవ చేయాలనుకునే వారిని ప్రోత్సాహిస్తేనే.. అమెరికా సురక్షితంగా ఉంటుంది. అలాంటి వారి విషయంలో వివక్ష చూపకూడదని.. వారి పట్ల గర్వంగా భావించాలి’’ అని బైడెన్ ట్వీట్ చేశారు. -
‘సరిహద్దుల పహారాలో మగువల తెగువ’
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో భారత్, పాకిస్తాన్ సరిహద్దుల మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్ఓసీ) వెంబడి భారత సైన్యం మంగళవారం తొలిసారిగా ‘రైఫిల్ విమెన్’ను దేశ భద్రత విధుల్లోకి దింపింది. ఎల్ఓసీ ప్రాంతంలో భద్రతా విధుల్లో మహిళలను మోహరించడం భారత సైన్యం చరిత్రలో ఇదే తొలిసారి. సముద్ర మట్టానికి పదివేల అడుగుల ఎత్తులో సాధనా పాస్ ద్వారా ఎల్ఓసీ వైపు వెళ్లే రహదారిపై భద్రతా విధుల్లో మహిళా అధికారి నేతృత్వంలో ఆరుగురు రైఫిల్ విమెన్‌ను నియమించామని సైన్యం వెల్లడించింది. అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఈ మహిళా సైనికులు భారత సైన్యంలో డిప్యుటేషన్‌పై చేరారని అధికార వర్గాలు తెలిపాయి. ఎల్ఓసీకి దగ్గరగా ఉన్న జాతీయ సరిహద్దుల్లో పహారా విధులను రైఫిల్ విమెన్‌కు అప్పగించినట్టు వెల్లడించాయి. సాధనా పాస్ ద్వారా దేశంలోకి నార్కోటిక్స్, నకిలీ కరెన్సీ, ఆయుధాల స్మగ్లింగ్‌ను వీరు అడ్డుకుంటారు. ఈ ప్రాంతం పాక్ ఆక్రమిత కశ్మర్‌కు అత్యంత చేరువగా ఉండటంతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్‌వైపు చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రాంతంలో 40 గ్రామాల ప్రజలు కశ్మీర్లోకి వెళ్లేందుకు సాధనా పాస్ మీదుగా వెళ్లాల్సిన క్రమంలో వీరిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుంటారు. ఈ గ్రామాల నుంచి వచ్చే మహిళలు ఉన్న వాహనాలను తనిఖీ చేసేందుకు రైఫిల్ విమెన్ సేవలను భారత సైన్యం వినియోగించుకోనుంది. భారత సైన్యంలో మహిళలు శాశ్వత హోదాలో పనిచేయవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. చదవండి : చైనాకు దీటుగా బలగాల మోహరింపు -
ఆడ'వార్'
ప్రపంచ యుద్ధ క్షేత్రాలలో 'షి'శస్త్రం వియ్ కెన్ డు యుద్ధం క్రూరంగా ఉంటుంది. మహిళలో కారుణ్యం ఉంటుంది. ఎలా ఈ రెండూ మ్యాచ్ అవడం? యుద్ధంలో శత్రువు యుద్ధధర్మాన్నీ, యుద్ధనీతినీ విస్మరిస్తాడు. ఆ శత్రువుకు మహిళ బందీగా దొరికితే ఇంకేమైనా ఉందా?! యుద్ధంలో ఊహించని విధంగా దుర్భరమైన పరిస్థితులు ఏర్పడతాయి. మహిళ మానసికంగా వాటిని తట్టుకుని నిలబడవచ్చు. కానీ శారీరకంగా ఆమె శక్తి సరిపోకపోతే? ఇదిగో.. ఇన్ని డౌట్లు వస్తాయి.. మహిళను యుద్ధభూమికి పంపడానికి!! ‘వియ్ కెన్ డు ఇట్’ అని మహిళలు ఎంత చెయ్యెత్తి పిడికిలి బిగించినా, ‘వి కాంట్ డూ ఇట్ ప్లీజ్’ అని ప్రపంచ దేశాలు మహిళల్ని కంబాట్ (యుద్ధం)లోకి తీసుకోలేమని చెప్పి, దశాబ్దాలపాటు నిరుత్సాహపరుస్తూ వచ్చాయి. సైన్యంతో నిమిత్తం లేకుండా తమకై తాముగా కదన రంగంలోకి దుమికిన క్వీన్ బోడికా (రోమ్కు వ్యతిరేకంగా బ్రిటన్ తరఫున), జోన్ ఆఫ్ ఆర్క్ (ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా ఫ్రాన్స్ తరఫున) వంటి వారు చరిత్రలో ఉన్నప్పటì కీ వారు మగవేషంలో మాత్రమే ఫైట్ చేయవలసి వచ్చింది. సుమారు 18వ శతాబ్దం వరకు ప్రపంచంలో ఎక్కడా మహిళలు ఒక ప్రత్యేక సైనిక విభాగంగా యుద్ధక్షేత్రానికి వెళ్లింది లేదు. తొలిసారి రష్యా మొదటి ప్రపంచ యుద్ధంలోకి ఒక మహిళా దళాన్ని పంపింది. ఆ తర్వాత ఒక్కో దేశం రష్యాను అనుసరించింది. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, జర్మనీ.. తమ దేశ మహిళలకు శత్రుదేశాల విమానాలను కూలగొట్టే యాంటీ–ఎయిర్‌క్రాఫ్ట్ యూనిట్లలో శిక్షణ ఇప్పించి మరీ యుద్ధానికి పంపాయి. ఆ తర్వాతి రెండు శతాబ్దాలలోనూ అనేక దేశాలు మహిళలను యుద్ధ విధుల్లోకి తీసుకోవడం మొదలు పెట్టాయి. భారత్ అయితే మరీ ఇటీవల మాత్రమే తన మహిళలకు ఈ అవకాశాన్ని కల్పించింది. మహిళలను యుద్ధక్షేత్ర విధుల్లోకి తీసుకునేది లేదని 2015లో స్పష్టంగా ప్రకటించిన అప్పటి రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ 2016లో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని ‘పోరాటంలోకి మీరూ రావచ్చు’ అని త్రివిధ దళాలలోకి మహిళలకు ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏ దేశం ఎప్పుడు తన మహిళలకు యుద్ధరంగపు సైనికులుగా అవకాశం కల్పించిందో ఒకసారి చూద్దాం. అమెరికా: 2013 జనవరి 24న అమెరికా రక్షణశాఖ కార్యదర్శి లియోన్ పనెట్టా యుద్ధరంగంలోకి మహిళలు రావడంపై అప్పటి వరకు ఉన్న నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేశారు. యునైటెడ్ కింగ్డమ్: 2016 జూలైలో భూతలంపై పోరాడే యుద్ధ సైనికులుగా మహిళలను నియమించడానికి అవరోధంగా ఉన్న నిబంధనలను యు.కె.తొలగించింది. జర్మనీ: 2011లో అన్ని ఫైటింగ్ యూనిట్లలోకి మహిళలను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియా: 2011 నుంచి 2013 వరకు విడతల వారీగా దేశ రక్షణ దళాలలోని పోరాట విభాగాలలో మహిళలకు అవకాశం కల్పించింది. కెనడా: ‘కెనడా మానవ హక్కుల చట్టం’ ప్రకారం కెనడా సైనిక దళాలలోనూ మహిళలకు స్థానం కల్పిస్తూ 1989లో నిర్ణయం తీసుకుంది. 2000 సంవత్సరంలో.. జలాంతర్గాములలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని రద్దు చేసింది. డెన్మార్క్: మహిళలు యుద్ధరంగంలోకి పనికొస్తారా అనే విషయంపై సర్వే చేయించి, సైన్యంలో స్త్రీ పురుషులిద్దరూ సమానమైన పోరాట పటిమను కనబరుస్తారని ఆ సర్వేలో తేలడంతో 2010 నుంచి మహిళల్ని యుద్ధంలోకి తీసుకుంటోంది. ఫిన్లాండ్: ‘మగవాళ్లకు మాత్రమే’ అనే నిబంధనేమీ ఫిన్లాండ్లో లేదు. అలాగే మహిళలకు ప్రత్యేక ఆహ్వానమేమీ లేదు. మహిళలు తమకు ఇష్టమైతే ఆర్మీలోని యుద్ధ విభాగాలలో చేరొచ్చు. ఫ్రాన్స్: ఈ దేశపు యుద్ధ విధుల్లో ఐదింట ఒక శాతం వరకు మహిళలు ఉన్నారు. మహిళలు యుద్ధ విధుల్లోకి రావడానికి అక్కడ ఉన్న నిబంధలను ఫ్రాన్స్ తన అవసరాన్ని బట్టి సడలించుకుంటూ వస్తోంది. ఇజ్రాయిల్: 2000లో ‘సైనిక సేవల్లో సమానత్వ సవరణ బిల్లు’ను తీసుకువచ్చింది. నాటి నుంచి మహిళల నియామకాలు ఎక్కువయ్యాయి. నార్వే: 1985లోనే సబ్మెరైన్స్లోకి మహిళల్ని తీసుకుంది! 2015 నాటికి ‘కంపల్సరీ మిలటరీ సర్వీస్’లోకి కూడా మహిళలు వచ్చేశారు. శ్రీలంక: సాధారణ యుద్ధరంగంలో తప్ప.. ప్రత్యేక దళాలు, పైలట్ బ్రాంచ్, నావల్ ఫాస్ట్ ఎటాక్.. వంటి ‘డూ ఆర్ డై’ విభాగాలలోకి మాత్రం ఇప్పటికీ మహిళలకు అవకాశం లేదు. స్వీడన్: 1989 నుండి అన్ని యుద్ధ విధుల్లోకి స్వీడన్ తన మహిళల్ని స్వాగతిస్తోంది.