
Ganesh Chaturthi- Decoration Ideas: వినాయక చవితికి గణేష్ మూర్తిని పెట్టే చోట, ప్రతిమకు వెనుకవైపు మండపంలా అనిపించే అలంకరణ ఎలా ఉండాలో ఇప్పటికే ఓ ఆలోచన చేసి ఉంటారు. వాటిలో గ్రాండ్‌గా కనిపించేవే కాదు, సింపుల్‌గానూ, సూపర్బ్‌గానూ అనిపించే అలంకరణలూ ఉన్నాయి.
పూల దారాలు..
పువ్వుల దండలు నాలుగు లైన్లుగా అమర్చి సెట్ చేసినా చాలు అలంకరణకు ఒక రూపం వస్తుంది. అయితే, వీటికి ఏ విధమైన పూలు వాడాలో కూడా తెలిసి ఉండాలి. బయటి మండపాల్లో అయితే పెద్ద పెద్ద దండలతో అలంకరిస్తారు. ఇంట్లో చిన్న ప్లేస్ ఉంటుంది కాబట్టి కార్నర్ ఏరియాను ఎంచుకోవాలి. త్వరగా వాడిపోనివి, బరువు లేని పూలను వాడడం ఉత్తమం.
హ్యాంగింగ్స్
కాగితాలను తామర, గులాబీ రూపు వచ్చేలా కత్తిరించాలి. దారానికి సెట్ చేస్తూ, మధ్య మధ్య పూసలతో అలంకరించవచ్చు. రెండు నుంచి ఎన్ని వరుసలైనా డిజైన్ చేసుకోవచ్చు. గట్టి అట్టముక్కలతో చేసిన ఈ హ్యాంగింగ్స్ ఆన్‌లైన్ లేదా మార్కెట్‌లోనూ అందుబాటులో ఉంటున్నాయి. బ్యాక్ డ్రాప్ అలంకరణలో వీటిని ఎంచుకోవచ్చు.
బ్రాస్ బెల్స్
ఇవి కొంచెం ఖరీదు ఎక్కువ. కానీ, ఎప్పుడైనా హస్తకళల ఎగ్జిబిషన్స్, ఏదైనా ప్రత్యేక సందర్శనీయ స్థలాలకు వెళ్లినప్పుడు ఇలాంటి బ్రాస్ హ్యాంగింగ్స్‌ను కొనుగోలు చేయొచ్చు. దేవతా మూర్తులు, చిహ్నాలతో ఉన్న హ్యాంగర్స్‌ను బ్యాక్ డ్రాప్ అలంకరణలో ఉపయోగిస్తే ఆధ్యాత్మిక భావన వెల్లివిరుస్తుంది.
మిర్రర్ వర్క్
హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన స్టార్ షేప్ క్లాత్స్, ప్యాచ్ వర్క్, అద్దాలతో కుట్టిన హ్యాంగర్స్ ప్రత్యేక కళతో ఆకట్టుకుంటాయి. వీటిని కూడా బ్యాక్ డ్రాప్ అలంకరణకు వాడవచ్చు. కళాత్మకమైన ఇలాంటి అలంకరణ కావాలనుకుంటే రాజస్థానీ, గుజరాతీ ట్రైబల్ ఎంబ్రాయిడరీతో దొరికే హ్యాంగింగ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ఆసక్తి సొంతంగానూ తయారుచేసుకోవచ్చు.
ముగ్గుల అలంకరణ
ఒక ప్లెయిన్ క్లాత్ లేదా రంగు పేపర్‌పైన మెలికల ముగ్గు (కోలమ్)ను డిజైన్ చేసుకుని, బ్యాక్ డ్రాప్‌గా వాడితే చాలు ఏ ఇతర అలంకరణ అక్కర్లేదనిపిస్తుంది. ఈ ముగ్గు కనిపించేలా పువ్వుల దండ వేలాడదీస్తే వ్రతం, వేడుక చేసే స్థలం అందంగా మారిపోతుంది. ఇలాంటి అలంకరణలో చూపే ఏ చిన్న సృజనాత్మకతైనా చూపరులను మళ్ళీ మళ్లీ వెనక్కి తిరిగి చూసేలా చేస్తుంది.
చదవండి: Ganesh Chaturthi- Palavelli: వినాయక చవితి.. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే!
Ganesh Chaturthi 2022: వరసిద్ధి వినాయక పూజ, విఘ్నేశ్వరుని కథ.. పూర్తి పూజా విధానం