మనదేశంలో పలు విభాగాల్లో అవార్డులు ఇస్తారు గానీ కుకింగ్(వంటకాల) విభాగంలో ఇవ్వరు. పోనీ బాగా వెరైటీ వంటకాలతో రుచులను అందించే రెస్టారెంట్‌లకు కూడా కనీసం అవార్డు ఇవ్వడం గానీ ఆ చెఫ్‌లను గుర్తించడం వంటివి జరగవు. జస్ట్ టీవీ షోలతోనో లేక ఆ రెస్టారెంట్ అడ్వర్టైస్‌మెంట్ వల్ల పేరు వస్తుంది అంతే. కానీ బ్యాంకాక్ వంటి విదేశాల్లో అలా ఉండదు. మంచి రుచులతో కూడిన విభిన్న వంటకాలు అందించే రెస్టారెంట్‌లను గుర్తించి అవార్డులిస్తాయి. ఆ చెఫ్‌లను కూడా ప్రశంసిస్తారు. ఈ ఏడాది అవార్డుని ఓ భారతీయ రెస్టారెంట్ దక్కించుకోవడమే గాక ఆ ఘనతను దక్కించుకున్న తొలి భారతీయ మహిళా చెఫ్‌గా గరిమా అరోరా నిలవడం మరింత విశేషం.
బ్యాంకాక్‌లో పలు రెస్టారెంట్‌లు ఉన్నాయి. అయితే విభిన్న వంటకాలతో మంచి రుచులను అందిస్తున్న 'గా(Gaa)' అనే భారతీయ రెస్టారెంట్ మిచెలిన్ స్టార్ అవార్డు అందుకుంది. పైగా ఇది రెండోసారి ఆ అవార్డును గెలుచుకోవడం. ఈ రెస్టారెంట్‌ని ముంబైకి చెందిన గరిమా అరోరా ప్రారంభించింది. బ్యాకాంక్‌లోని కుకింగ్‌కి సంబంధించిన అత్యున్నత అవార్డు మిచెలిన్ స్టార్‌ని రెండు సార్లు కైవసం చేసుకోవడంతో ఈ ఘనతను పొందిన తొలి భారతీయ మహిళగా ఈ 37 ఏళ్ల అరోరా నిలిచింది. అరోరా థాయ్‌లాండ్‌లో కోపెన్‌హెగెన్‌లో నివశిస్తుంది.
భారత్‌తో థాయిలాండ్‌కి ఉన్న సంబంధాల రీత్యా బ్యాంకాక్‌లో రెస్టారెంట్ పెట్టే సాహసం చేశానని చెప్పుకొచ్చింది అరోరా. అవార్డుల కోసం వివిధ రకాల వంటకాలు చేయలేదని అంటోంది. బ్యాంకాక్‌లో ఇన్ని వేల రెస్టారెంట్‌లు ఉండగా వాటన్నింటిని కాదని తన రెస్టారెంట్‌కే రెండు సార్టు మిచెలిన్ స్టార్ అవార్డులు రావడం చాలా సంతోషంగా అనిపించిందని చెప్పింది. ప్రతి కస్టమర్‌కి కొత్తగా అనిపించేలా విభ్ని రుచులను అందించడంపైనే మా సిబ్బంది ఫోకస్ చేస్తుంది. ఎప్పటికప్పుడూ సాంకేతికతో కూడిన ఆలోచనలతో విభిన్నవంటకాలను తీసుకొస్తుంటాం. ఆ అభిరుచే ఈ అవార్డులను తెచ్చిపెట్టిందని వివరించింది అరోరా.
ఐతే ఇలాంటి అవార్డులే భారత్‌లో కూడా ఉంటే కనీసం ముగ్గురు మిచెలిన్ స్టార్ చెఫ్‌లు ఉండేవారని అంటోంది. ఇలాంటి అవార్డులను భారత ప్రభుత్వం కూడా ఇస్తే బాగుండనని ఆమె చెబుతోంది. ఆహారం కూడా అద్భుతమైన ఆకర్షణ శక్తే. దీన్ని విభ్నింగా అందించే మార్గాల గురించి అన్వేషించే ఆలోచన వైపుకి వెళ్లకపోవడంతోనే దీన్ని భారత్ గుర్తించలేదు. ముఖ్యంగా పర్యాటక శాఖ దీనిపై దృష్టిసారిస్తే బాగుండనని అరోరా అభిప్రాయపడింది. భారత్‌లో ముఖ్యంగా సంప్రదాయ వంటకాలు, దేశీయ ఆహార పదార్థాలపైనే చెఫ్‌లు దృష్టిసారించారని, విభిన్న రుచికర వంటాకాలు వెరైటీగా అందించే ఆలోచన చేయకపోడమే ఇలాంటి అవార్డు లేకపోవడటాని ప్రధాన కారణమని అరోరా చెబుతోంది.
ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారంటేట..
అత్యుత్తమ వంటలను అందించే రెస్టారెంట్లకు మిచెలిన్ స్టార్ ఇవ్వడం జరుగుతుంది. ఐదు సార్వత్రిక ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు: పదార్థాల నాణ్యత, రుచుల ప్రాధాన్యత, అందించడంలో సాంకేతికతతో కూడిన విధానం, వంటకాలను రుచిగా తయారు చేసే చెఫ్ నైపుణ్యం, మెనులోని అర్థమయ్యేల ఆహార పదార్థాల లిస్టు తదితరాలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డులను బ్యాకాంక్ అధికారులు ఇస్తారు.
(చదవండి: ఆధ్యాత్మిక బలానికి అత్యాధునిక చిహ్నం.. దీని ప్రత్యేకతలు తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment