జస్ట్‌ ఆ నాలుగు జీవనశైలి మార్పులతో.. 90 నుంచి 55 కేజీల బరువు! | Health Tips: Mumbai Influencer Lose 90 Kg To 55 Kg To 4 Lifestyle Changes | Sakshi
Sakshi News home page

జస్ట్‌ ఆ నాలుగు జీవనశైలి మార్పులతో.. 90 నుంచి 55 కేజీల బరువు!

Apr 3 2026 12:05 PM | Updated on Apr 3 2026 12:13 PM

Health Tips: Mumbai Influencer Lose 90 Kg To 55 Kg To 4 Lifestyle Changes

వెయిట్‌లాస్‌ అనగానే కఠినమైన ఆహారాలు, ఇష్టమైన ఫుడ్‌ని వదులుకోవడం, తీవ్రమైన వ్యాయామాలు గంటలు తరబడి చేయడం అని భావిస్తుంటారు చాలామంది. కానీ అవేమి కానేకాదు అని కొందరు అనుభవ పూర్వకంగా తెలుసుకోవడమే గాక, చాలా సింపుల్‌ లైఫ్‌స్టైల్స్‌తో కిలోల కొద్ది బరువు తగ్గి ఇతరులకు ప్రేరణగా నిలుస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ ముంబైకి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్‌. ఇంతకీ ఆమె బరువు తగ్గడం కోసం ఎలాంటి మార్పులు జోడించిందంటే..

కంటెంట్ క్రియేటర్ మల్లికా ఫతేపురియా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా సరికొత్త వెయిట్‌లాస్‌ జర్నీని పంచుకున్నారు. ఒకప్పుడు తాను 90 కిలోల బరువు ఉండేదాన్ని అని , ప్రస్తుతం 55 కిలోలకు చేరి సుమారు 35 కేజీ బరువు తగ్గానని చెప్పుకొచ్చారు. అయితే తన వెయిట్‌లాస్‌ జర్నీలో ఏం చేసింది అనేదానికంటే..ఏం మానేశాను, వేటికి దూరంగా ఉన్నాను అనేదే ఎక్కువగా ఉంటుందని అంటోందామె.

బరువు తగ్గడం కోసం..

డైట్‌లు చేయడం:
తాను కఠినమైన డైట్‌లు పాటించిన ప్రతిసారీ కొంత బరువు తగ్గినట్లు తగ్గి..మళ్ళీ యథావిధి బరువుకి వచ్చేసేదాన్ని అని కంటెంట్‌ క్రియేటర్‌ పంచుకున్నారు. బరువు తగ్గడాన్ని ఒక స్వల్పకాలిక లక్ష్యంగా చూడటం మానేసి, తాను పాటించగలిగే అలవాట్లపై దృష్టి పెట్టడంతో ఆమె జీవితంలో  అనూహ్య మలుపు వచ్చింది.

కార్బోహైడ్రేట్లను తగ్గించడం
రొట్టె, అన్నం, లేదా పాస్తా వంటి ఆహారాలను పూర్తిగా మానేయడానికి బదులుగా, తక్కువ మొత్తంలో తీసుకునేలా కేర్‌ తీసుకున్నానని అంటోంది. ఆమె ప్రకారం, అసలు సమస్య ఈ ఆహారాలు కాదని.. సమతుల్యంగా తినడంలోనే సమస్య అంతా ఉందని అంటున్నారు.

విసుగు పుట్టించే భోజనాన్ని బలవంతంగా తినడం..
కఠినమైన ఆహార డైట్‌లు శిక్షలా మారాక..బరువు తగ్గడం కంటే..సమస్యే అధికంగా మారే అవకాశాలే ఎక్కువని అంటోంది. అందుకే ఆస్వాదించకలిగేలా భోజనాన్ని ఆరోగ్యమైన విధంగా తీసుకుంటే..ఏదో కోల్పోయానన్న భావన దరిచేరదు. హెల్దీగా, ఆనందంగా బరువు తగ్గుతాం అని అంటోంది.

అతిగా వ్యాయామం చేయడం
తీవ్రమైన రోజువారీ వ్యాయామాలు అవసరమని తాను భావించేదాన్ని అని మల్లిక చెప్పారు. కానీ కాలక్రమేణా, నడవడం, శక్తి శిక్షణ, క్రమం తప్పకుండా చురుకుగా ఉండటం వంటి సాధారణ విషయాలు చాలా బాగా పనిచేస్తాయని గ్రహించానని అంటున్నారామె. 

అంతేగాదు బరువు తగ్గడం అంటే మంచి ఆహారాన్ని వదులుకోవడం లేదా మిమ్మల్ని బాధకు గురిచేసుకోవడం వంటివి కానేకాదు అని అంటోంది. నిలకడతో సమతుల్యానికి పీటవేస్తే చాలు బరువు తగ్గడం సులభం అని అంటోంది మల్లికా.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

 

(చదవండి: 14 ఏళ్లకే స్కూల్‌ డ్రాపౌట్‌..కానీ ఆ ఆవిష్కరణ..!)

 

 

Advertisement
 
Advertisement
Advertisement