రుచికరమైన క్యాప్సికమ్ బజ్జీ తయారు చేసుకోండిలా..
కావలసినవి:
►క్యాప్సికమ్ – 6 లేదా 8 (శుభ్రంగా కడిగిపెట్టుకుని.. నాలుగు వైపులా చాకుతో గాటు పెట్టుకోవాలి),
►శనగపిండి – 1 కప్పు
►ఉప్పు – తగినంత
►కారం – 1 టీ స్పూన్
►పసుపు – చిటికెడు
►ధనియాల పొడి – అర టీ స్పూన్
►వంట సోడా – కొద్దిగా
►క్యారెట్ ముక్కలు, బీట్ రూట్ ముక్కలు, కొత్తిమీర తురుము, ఉల్లిపాయ ముక్కలు – రుచికి అదనంగా (అన్నీ ఒక బౌల్లో వేసుకుని.. నిమ్మరసం, ఉప్పు, కారం కలిపి పక్కన పెట్టుకోవాలి)
►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ:
►ముందుగా ఒక బౌల్లో శనగపిండి, కారం, వంట సోడా, ఉప్పు, ధనియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి
►ఇందులో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
►అనంతరం ఒక్కో క్యాప్సికమ్ తీసుకుని.. శనగపిండి మిశ్రమంలో ముంచి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
►చల్లారాక చాకుతో ఒక వైపు కట్ చేసుకుని.. అందులో క్యారెట్ ముక్కల మిశ్రమాన్ని నింపుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఈ బజ్జీలు.
Comments
Please login to add a commentAdd a comment