పండుగ సీజన్‌లో ఇలా ఇడియప్పం పులిహోర తయారు చేసుకోండి!
కావలసినవి:
►బియ్యప్పిండి – రెండున్నర కప్పులు
►నీళ్లు – కొద్దిగా
►మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు
►నెయ్యి – 1 టీ స్పూన్
►ఆవాలు, ధనియాలు, మినపగుళ్లు, జీలకర్ర, శనగపప్పు, జీడిపప్పు, వేరుశనగలు – కొన్నికొన్ని చొప్పున
►ఎండు మిర్చి – 1 (రెండు ముక్కలు అడ్డంగా తుంచి)
►పచ్చిమిర్చి – 3 (మధ్యలోకి చీరి)
►నూనె – సరిపడా
►ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు
►కరివేపాకు – 2 రెమ్మలు, నిమ్మకాయ – 1
తయారీ:
►ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి వేసుకుని.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి.
►తర్వాత ఇడ్లీ పాన్‌కి బ్రష్‌తో నెయ్యి పూసుకుని, మురుకుల మేకర్‌కి సన్నని హోల్స్ ఉండే ప్లేట్‌ని అమర్చాలి
►అందులో ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా నింపుకుని, ప్రతి ఇడ్లీ గుంతలో.. గుండ్రంగా తిప్పుతూ, గట్టిగా ఒత్తితే నూడుల్స్‌లా వస్తాయి.
►వాటిని ఆవిరిపై ఉడికించి, చల్లారాక.. ఒక్కో ఇడ్లీ ఇడియప్పాన్ని నాలుగైదు ముక్కలుగా విడదీసుకోవాలి.
►అనంతరం స్టవ్‌పైన కళాయి పెట్టి.. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి.
►తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపగుళ్లు, పసుపు, ధనియాలు, జీడిపప్పు, వేరుశనగలు, ఎండు మిర్చి.. పచ్చిమిర్చి.. కరివేపాకు ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకోవాలి.
►అందులో నిమ్మరసం వేసి కాసేపు తిప్పాలి.
►అనంతరం ఇడియప్పం మిశ్రమాన్ని వేసుకుని.. గరిటెతో కలియదిప్పుకోవాలి.
ఇవి కూడా ట్రై చేయండి: Paneer Vegetable Idli Recipe: పన్నీర్ వెజిటబుల్ ఇడ్లీ, కోకోనట్ పాన్‌కేక్ తయారు చేసుకోండిలా!
Surnali Dosa Recipe: సూర్నాలి దోశ ఎప్పుడైనా తిన్నారా? ఇలా తయారు చేసుకోండి!
Comments
Please login to add a commentAdd a comment