Allam Health Benefits In Telugu: కాస్త తలనొప్పిగా అనిపిస్తే చాలు అల్లం ఛాయ్ వైపు చూస్తారు చాలా మంది! అంతేనా వాంతులు అయ్యేవాళ్లు బుగ్గన ఓ అల్లం ముక్కను పెట్టుకుంటారు.. ఇలా అల్లం మన నిత్యజీవితంలో భాగమైపోయింది. నిజానికి ప్రాచీన కాలం నుంచే ఇది ఉపయోగంలో ఉంది.
వంటకాల్లోనూ, సంప్రదాయ ఔషధాల తయారీలోనూ దీనిని వినియోగిస్తారు. మన దేశంతో పాటు దక్షిణాసికాయ దేశాల్లో కూడా అల్లం పంటను సాగు చేస్తున్నారు. పచ్చి అల్లం, ఎండిన అల్లం, అల్లం పొడి, అల్లం నూనె, అల్లం జ్యూస్ .. అవసరాన్ని బట్టి ఏ రూపంలోనైనా దీనిని వాడుకోవచ్చు.
అల్లంలో ఉండే పోషకాలు:
►అల్లంలో కార్బోహైడ్రేట్లు(పిండిపదార్థాలు) ఉంటాయి.
►పీచు పదార్థాలను కూడా కలిగి ఉంటుంది.
►ఇక విటమిన్లలో విటమిన్ బీ3, బీ6, విటమిన్ సీ ఉంటాయి.
►వీటితో పాటు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్సరస్, జింక్, ఫొలేట్, నియాసిన్ అల్లంలో ఉంటాయి.
►ఖనిజలవణాలు కూడా పుష్కలం.
►యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
ఒక టేబుల్ స్పూన్ తాజా అల్లంలో లభించే పోషకాలు
4.8 కేలరీలు
1.07 గ్రాముల పిండిపదార్థాలు
.12 ఫైబర్
.11 ప్రొటిన్
.05 కొవ్వులు
.1 షుగర్
వీటితో పాటు పైన చెప్పుకొన్న పోషకాలు తగు మోతాదుల్లో లభిస్తాయి.
అల్లం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
►ఇందులోని జింజరాల్ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కలిగి ఉంటుంది.
►ఒత్తిడిని దూరం చేసి మెదడును ప్రశాంతంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
►నోటి దుర్వాసన పోగొట్టేందుకు అల్లం చక్కని విరుగుడుగా పనిచేస్తుంది.
►ఆకలిని పెంచే గుణాలు అల్లంలో ఉంటాయి.
►అల్లం అరుచిని పోగొడుతుంది.
►అల్లం బుగ్గన పెట్టుకుంటే.. దీని రసం మెల్లగా లోపలికి వెళ్తూ వాంతులు వచ్చే భావన, వికారాన్ని తగ్గిస్తుంది.
►గొంతులో నస ఉన్నా అల్లంతో చెక్ పెట్టేయవచ్చు.
►జలుబు, దగ్గును దూరం చేస్తుంది
►అదే విధంగా కఫ సమస్యను కూడా తగ్గిస్తుంది.
►బరువు తగ్గడం(కేలరీలను బర్న్ చేసి)లోనూ ఉపయోగపడుతుంది.
►అల్సర్, కీళ్ల నొప్పులు, అజీర్తి, మధుమేహం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
►రుతుస్రావ సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.
►శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
►కాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తుంది.
►ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తుంది.
చదవండి: Health Benefits of Eating Dates: తీపిగా ఉండే ఖర్జూరాలు తరచుగా తింటున్నారా? ఈ విషయాలు తెలిస్తే!
Beauty Tips: కొబ్బరి నూనె.. కాఫీ పొడి.. ముఖం మెరిసిపోవడం ఖాయం
Comments
Please login to add a commentAdd a comment