
‘డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా’ అని ఏదో మాటవరసకి అంటాము. కానీ ఓ వ్యక్తి నిజంగానే తన పెరట్లో మొక్కల నుంచి రూపాయి కాయిన్లను కాయించాడు.. నమ్మకం కుదరట్లేదా.. ఈ వీడియో చూడండి.
ఇంటి పెరట్లో కూరగాయల మొక్కలు పెంచే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. కానీ ఈ వీడియోలో కనిపించే వ్యక్తి తన పెరట్లో కాసిన క్యాప్సికం కాయలను చీల్చితే లోపల రూపాయి బిళ్లలు ఉండటం కనిపిస్తుంది. అతను రెండు క్యాప్సికంలను కట్ చేస్తే రెండింటి నుంచి రూపాయి బిళ్లలు రావడం మనం ఈ వీడియోలో చూడొచ్చు. దీనిని చూస్తే ఒక్క క్షణం మైండ్ బ్లాంక్ అవుతుంది. తర్వాత అతను చేసిన ట్రిక్ తెలిసి.. ఈమాత్రం మేము కూడా పండించగలం అనిపిస్తుంది.
చదవండి: Wonder of Science: బాప్‌రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!!
అవును.. అతను ముందుగానే క్యాప్సికం వెనుక భాగం కట్‌చేసి లోపల కాయిన్స్ పెట్టి, గమ్‌తో అతికించి ఉంటాడు. వీడియోలో నిజంగానే క్యాప్పికం లోపల కాయిన్స్ ఉన్నట్లు చూపించాడు. కానీ మన బ్రెయిన్‌లోపల చాలా విషయం ఉందని.. వెంటనే అతని ట్రిక్ కనిపెట్టేస్తామని అతను ఊహించి ఉండడు. సహజంగా చెట్లకు డబ్బులు కాయవని మనందరికీ తెలిసిందే!! ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భిన్న స్పందన వస్తోంది.
చదవండి: Salmonella Outbreak: ఉల్లి ఎంత పని చేసింది?.. 650 మందికి తీవ్ర అస్వస్థత..