సార్స్–కోవ్–2 నుంచి రూపాంతరం చెందిన కొత్త రకం వైరస్ బ్రిటన్‌లో వేగంగా వ్యాపిస్తోంది. సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకూ 1,400 కేసులు నమోదయ్యాయి. కోవిడ్–19 వ్యాధికి కారణ మయ్యే సార్స్–కోవ్–2 సాధా రణంగా నెమ్మదిగా, అదీ కాల క్రమంలో మారుతూపోతుంది. కానీ ఈ కొత్తరకం వేగంగా పరివర్తనం చెందుతోంది. అంటే దానర్థం ఏమిటి? ఇది పాత వైరస్ స్థానాన్ని ఆక్రమించు కుంటుందా? దాన్ని పట్టుకోగలమా? ఇంకా ముఖ్య మైన విషయం, ప్రస్తుతం రూపొందుతున్న టీకాలు దీనిమీద ప్రభావశీలంగా పనిచేస్తాయా?
బి.1.1.7 అని నామకరణం చేసిన ఈ రూపాంతర వైరస్ బ్రిటన్‌తో పాటు ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా వ్యాపించే అవకాశం ఉంది. పాత వైరస్‌కూ దీనికీ ఉన్న ఒక ముఖ్యమైన తేడా ఏమిటంటే, 23 సార్లు పరి వర్తనం చెందడంతో పాటు జన్యుపటంలోని నాలుగు ప్రొటీన్లలో కూడా మార్పు జరగడం. 23 పరివర్తనా ల్లోని ఎనిమిది పరివర్తనాలు స్పైక్ ప్రొటీన్‌ను ప్రభా వితం చేస్తాయి. ఇదెందుకు ముఖ్యం అంటే, మనుషుల కణాల్లోకి వైరస్ ప్రవేశాన్ని స్పైక్ ప్రొటీన్ సుగమం చేస్తుంది. మానవ రోగనిరోధకత ప్రధాన లక్ష్యంగా చేసుకునే ఈ స్పైక్ ప్రొటీన్‌లో జరిగిన మార్పుల వల్ల వైరస్ మానవ కణాల్లోకి ప్రవేశించడం మరింత సుల భతరం అయ్యిందంటే అర్థం, ఒక మనిషి నుంచి మరో మనిషికి వైరస్ మరింత సులభంగా వ్యాపిస్తుందని.
ఈ పరివర్తనాలు వైరస్‌తో మనిషి రోగనిరోధకత పోరాడే గుణంలో కూడా మార్పు తేగలవు. అంటే, టీకా ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉన్నట్టు. ఈ వైరస్ సోకిన రోగుల నుంచి తీసుకున్న నమూనాల ప్రకారం, గత మూడు నెలల్లో ఇది నియమిత వేగంతో మారుతూ వస్తోంది. ఈ తరచుదనం వల్ల సార్స్–కోవ్–2కు కొత్త రూపమైన బి.1.1.7 మరింత ఎక్కువ సంక్రమించే గుణం కలిగివుంది. ఒక అంచనా ప్రకారం, పాత వైరస్ కంటే ఇది 70 శాతం అధిక సంక్రమణ గుణం కలిగి వుంది.
ఈ సంక్రమణ గుణానికి కారణం స్పైక్ ప్రొటీ న్‌లో జరిగిన మార్పులు. మనిషి కణాల్లోకి ప్రవేశించడా నికి ముఖద్వారంలా ఉండే ఏసీఈ2 రెసెప్టర్‌ను మరింత గట్టిగా పట్టుకునేలా ఈ మార్పులు పనిచేసి వుంటాయి. ఇంకా ఇతర మార్పులు కూడా దీనికి కారణం కావొచ్చు. బి.1.1.7 రకం మరింత ఎక్కువ వ్యాపించే గుణం కలిగివుందంటే ఎక్కువమందిని అనారోగ్యానికి గురిచేస్తుందని అర్థం. మరి ఇప్పుడు రూపొందుతున్న ఈ ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ఈ కొత్త రకం మీద కూడా అంతే గట్టిగా పనిచేస్తాయా? ఈ టీకాలు మన నిరోధక వ్యవస్థను ఒక కచ్చితమైన స్పైక్ ప్రొటీన్‌ను గుర్తించేలా చేసి దాని మీద పోరాడేలా శిక్షణ ఇస్తాయి. కానీ ఈ టీకాలు పాత వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్‌కు తగినట్టుగా రూపొందినవే తప్ప ఈ కొత్త రూప వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని కాదు. కాబట్టి ఊహించినంత ప్రభావశీలంగా పనిచేయకపోవచ్చు.
ఈ వైరస్–వ్యాక్సిన్ తప్పుగా జోడీకట్టడం అనేది శాస్త్రవేత్తలకు కాలానుగుణంగా ఫ్లూ వ్యాక్సిన్ రూపొం దించడంలో ఎప్పుడూ ఎదురయ్యే సవాలే. ఇలా సరిగ్గా జత కుదరని సందర్భాల్లో కూడా వ్యాధి తీవ్రతనూ, దాని సంభావ్యతనూ ఫ్లూ వ్యాక్సిన్లు అదుపులో ఉంచ గలిగాయి. కాబట్టి ఇప్పుడు ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటంటే ప్రస్తుతం రూపొందుతున్న టీకాలు బాగా పని చేస్తాయా అన్నది కాదు, ఎంతవరకు పనిచేయగలవు అన్నదే. అయితే దీనిమీద ఇంకా మనకు శాస్త్రీయమైన డేటా అందుబాటులో లేదు. కాబట్టి, ఫైజర్, మోడెర్నా టీకాల పనితనం గురించి అప్పుడే వ్యాఖ్యానించడం మరీ తొందరపాటు అవుతుంది.
ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి జనం టీకా వేయించుకోవాలా అనే అనుమానం తలెత్తుతుంది. కానీ బి.1.1.7 రూపాన్ని చూస్తూవుంటే టీకా మరింత త్వరగా వేయించుకోవాల్సిన అవసరం కనబడుతోంది. వ్యాక్సిన్–వైరస్ జోడీ కుదరనప్పటికీ, వ్యాక్సిన్ ప్రభావ శీలత తక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువమంది టీకా తీసుకోవడం ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ(మంద నిరోధ కత) పెంపొందించుకుని వైరస్‌ను అదుపులో ఉంచడం సాధ్యమవుతుంది. వైరస్ మరో కొత్త రూపంలోకి త్వరి తంగా మారడాన్ని కూడా ఆపడం వీలవుతుంది.
డేవిడ్ కెన్నెడీ
వ్యాసకర్త మైక్రోబయాలజిస్ట్
(The Conversation.com సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment