ఆద్యకళలకూ ఓ ఆశ్రయం! | Early Art Guest Column By Gorla Buchanna | Sakshi
Sakshi News home page

ఆద్యకళలకూ ఓ ఆశ్రయం!

Published Sat, Mar 26 2022 1:11 AM | Last Updated on Sat, Mar 26 2022 1:11 AM

Early Art Guest Column By Gorla Buchanna - Sakshi

ఆది కళా రూపాలు ఆదిమ చరిత్రకు చిరు నామాలు. అవి మనం నడిచొచ్చిన దారులు. తరతరాల రాతలను, మాటలను, పాటలను, పది రకాల వస్తువులను పదిల పర్చుకోవాల్సిన చారిత్రక బాధ్యత మన పైన ఉన్నది. చాలా వరకు ఆద్య (ఆది) కళా రూపాలు అంతరించిపోతున్నాయి. మిగిలిన వాటినైనా కాపాడుకోవాలి కదా!

ఈటెలు, కొత్త–పాత రాతియుగాల పని ముట్లు గత  కాలపు మానవుల జయాపజయా లను రికార్డు చేసినట్లే... అలనాటì  రాతి పలకలు, రాత పనిముట్లు, ఇప్పటికీ కొనసాగుతున్న అరుదైన ఇంపుసొంపైన వాద్య పరికరాలు, మానవ జీవిత భిన్న కోణాలకు ప్రతిబింబాలు.  ఈ నేలపై జీవించిన వీరుల పరాక్రమాలు, సామాన్యుల వీరోచిత గాథలకు ఈ ఆద్యకళలు అద్దం పడతాయి. అనేక ఉద్యమాలు విజయ వంతం కావడానికి ఈ ఆద్యకళలు వాహికలుగా నిలిచిన సంగతీ మరువరాదు. 

బొమ్మల పటం ద్వారానో... గోండు, కోయ, చెంచు, దాసరి,  జంగం, బైండ్ల, బైరా గుల రాగి రేకులు, తాళపత్రాలపై రాతల ద్వారా మన ఉన్నతికి పునాదులైన పూర్వీకుల సంస్కృతి, టెక్నాలజీలు తెలుస్తాయి. నాటి  బొమ్మల పటాలు, తాళ పత్ర గ్రంథాలు, అరు దైన సంగీత వాద్యాలూ వేలాదిగా ఉన్నాయి. వీటిని దాచడానికి, ముందు తరాలకు చూపడా నికి ఇంత చోటు చూపాలి. పద్మశ్రీ మొగి లయ్యతో అంతరించి పోతుందని భయపడు తున్న 12 మెట్ల కిన్నెర వంటి ఎన్నో వాద్య పరికరాలు ముందు తరాలకు అందాలంటే అచ్చంగా వీటికోసం మ్యూజియాలు నిర్మించ వలసిన అవసరం ఉంది.

భూమి లోపల నిక్షిప్తం అయిన వాటిని వెలికి తీసి చరిత్రను కాపాడుకోవడం ఒక అంశం అయితే... మన కళ్ల ముందు సజీవంగా వివిధ రూపాల్లో... ఐసీయూలో ఉన్న అద్భుత కళా ఖండాలను అక్కున చేర్చుకోవడం అన్నింటి కంటే ముఖ్యమైన అంశం. సంగీత సాహిత్యా లను ఆస్వాదించే హృదయాలు ఉన్నట్టే... వాటి మూల రూపాలను ఒడిసి పట్టుకుని ముందు తరాలకు అందించే ముందుచూపున్న మనసులు అవసరం. ఈ కళాఖండాలు అటువంటి మనసున్న మారాజుల కోసం వేచి ఉన్నాయి. అసలు, సిసలైన మూలవాసుల, ఆది వాసుల, ఆది మానవుల ఉనికిని సగర్వంగా చాటి చెప్పే కళాకారులను, కళారూపాలను, సాహిత్య సారాలను పాలకులు పట్టించుకోవాలి. 

ఈ కళారూపాలను ఆదరించడం, అక్కున చేర్చుకోవడం అంటే  అట్టడుగు వర్గాల, అశేష ప్రజారాశుల నిజ జీవిత గాథలను, చారిత్రక అనవాళ్లను గుర్తించినట్లే. వాటికి సామాజిక గౌరవాన్ని ఇచ్చినట్లే. ఇలాంటి సంగీత, సాహిత్య చారిత్రక ఆనవాళ్లను భద్రపర్చేందుకు మన రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో చొరవ తీసుకోవాలి.

భిన్న సాంస్కృతిక, సామాజిక, సామూహిక చైతన్య కేంద్రం హైదరాబాద్‌. ఇక్కడ పరిమిత కాలానికి సంబంధించిన చారిత్రక ఆనవాళ్లతో ఓ మ్యూజియం ఉంది. కానీ అనంతానంత యుగాల మానవ జీవిత పరిణామ క్రమ ప్రతి బింబాలైన అశేషజన సమూహాల ఆట, పాట, మాట, కళాసంస్కృతుల చైతన్యమూటలైన బొమ్మలు, పటాలు, రాగిరేకుల, జంట డోళ్ల, కిన్నెర, కొమ్ముబూరల, డప్పుల వంటి వాటికి ఆలవాలమైన మ్యూజియం లేదు. అటువంటి సంగ్రహాలయ ఏర్పాటు చేసేందుకు ప్రభు త్వాలు ముందుకు రావాలి. ప్రభుత్వాలు ఎలా ఉన్నా సినీ, మార్కెట్‌ శక్తులు మాత్రం ఆద్య కళారూపాలను అత్యంత చాకచక్యంగా వాడు కోవటం విశేషం.
గోర్ల బుచ్చన్న
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌
మొబైల్‌: 87909 99116

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement