భారతీయ శాస్త్ర రంగం ఎలాంటి లక్ష్యాన్ని కలిగి ఉండాలి అన్న ప్రశ్నకు, ‘‘ఈ శతాబ్దాన్ని తీసుకోవలసింది ఇండియా. దాని లక్ష్యం కూడా అందుకు తగ్గకుండా ఉండాలి’’ అన్నారు థామస్ బార్లో. జర్మనీ, అమెరికా, తాజాగా చైనా తర్వాత సైన్సులో ఇప్పుడిక భారత్ వంతు. ఈ దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు నేర్చుకుంటూనే భారత్ తనదైన ప్రత్యేక నమూనాను రూపొందించుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో భారత్ టాప్–3లో ఉండాలన్నదే మన లక్ష్యం కావాలి. మన పరిశోధనలు భారత్‌తో పాటు అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై కూడా దృష్టి పెట్టాలి. గంగానదిని సమర్థంగా శుద్ధి చేయగలిగితే... అది ప్రపంచవ్యాప్తంగా కలుషిత జలాల శుద్ధికి ఉపయోగపడుతుంది కదా!
హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది మొదట్లో జరిగిన ఇండియాసైన్స్ ఫెస్టివల్‌లో మేము బిడియపడకుండా ఓ ప్రశ్న వేశాం: ‘‘భార తీయ శాస్త్ర రంగం ఎలాంటి లక్ష్యాన్ని కలిగి ఉండాలి?’’ మాతోపాటు చర్చలో పాల్గొన్న గ్లోబల్ ఇన్నొవేషన్ నిపుణుడు థామస్ బార్లో సమాధానమిస్తూ... ‘‘ఈ శతాబ్దాన్ని తీసుకోవలసింది ఇండియా. దాని లక్ష్యం కూడా అందుకు తగ్గకుండా ఉండాలి’’ అన్నారు.
ఇదేదో యథాలాపంగా ఇచ్చిన సమాధానం కాదు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనాత్మకమైన సైన్స్ మోడల్స్ పుట్టుకొచ్చిన తీరును, చరిత్రను గమనించినా ఇదే స్పష్టమవుతుంది. జర్మనీ పరిశోధనలు, టెక్నికల్ యూనివర్సిటీల ఏర్పాటు; అమెరికాలో యూనివర్సిటీ నెట్ వర్క్, పరిశ్రమతో దాన్ని అనుసంధానించడం, అంతరిక్ష, రక్షణసంస్థల ఏర్పాటు; తాజాగా కృత్రిమ మేధ, రసాయన, జీవశాస్త్రరంగాల్లో చైనా పురోగతి–– వీటన్నింటిని చూస్తే ఇప్పుడిక భారత్
వంతు. ఈ దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు నేర్చుకుంటూనే భారత్ తనదైన ప్రత్యేక నమూనాను రూపొందించుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ రకమైన ఏర్పాటు సాధ్యమే. ఎందు కంటే... ఆర్థిక వ్యవస్థ విస్తృతి బాగా ఉంది. పరిశ్రమలు తగినన్ని ఉన్నాయి. స్టార్టప్‌లతో కూడిన వ్యవస్థ, మార్కెట్ వ్యాప్తి, సైన్స్ అండ్ టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టేందుకు తగిన వనరులు ఉన్నాయి.
కానీ భారత్‌కు లేనిదల్లా సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యూహంలో ఫోకస్!
మన లక్ష్యం ఏమిటన్న విషయాన్ని చర్చించే ముందు మన ఆశయం ఎంత పెద్దదిగా ఉందన్నది మాట్లాడుకోవాలి. 2019లో జరిగిన మొదటి ఇండియా సైన్స్ ఫెస్టివల్‌లో ‘మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ లాంటి సంస్థను భారత్ ఎలా నిర్మించ గలదని ప్రశ్నించాం. దానికి సైన్స్ ఇ¯Œ స్టిట్యూట్ డైరెక్టర్ ఒకరు సమాధానమిస్తూ... భారత సైన్స్ సంస్థలు కూడా అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేస్తున్నాయని అన్నారు. అదే రోజు మేము ఒక చైనా శాస్త్ర నిపుణుడిని చైనీస్ మోడల్ నుంచి భారత్ నేర్చుకోదగ్గ అంశాలేమిటని అడిగాం. ‘‘చైనాలో సైన్స్ పురోగమిస్తోందని ఎవరు చెప్పారు? ఎంత మంది చైనీయులకు నోబెల్ అవార్డులు వచ్చాయి? ప్రపంచాన్ని మార్చేసే ఆవిష్కరణలు మేమెన్ని చేశాం? చేయాల్సింది చాలా ఉంది’’ అని ఆయన సమాధానమిచ్చారు. ఇరు దేశాల ఆశ యాల్లో ఉన్న వైరుద్ధ్యాన్ని ఈ ఉదంతం స్పష్టం చేస్తుంది. ఆత్మ విమర్శ, ఉన్నతమైన ఆశయం, తగిన కార్యాచరణల మేళవింపుతోనే మనం సరైన ఫలితాలను చూడవచ్చు. వీటిల్లో ఒకటి మాత్రమే కలిగి ఉంటే మాటలకే పరిమితమవుతాం.
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో భారత్ టాప్–3లో ఉండా లన్నదే మన లక్ష్యం కావాలి. అయితే దాన్ని అందుకోవడం ఎలా అన్నదే ప్రశ్న. ఓపెన్ ఎండెడ్ అంటే నిర్దిష్ట లక్ష్యమేదీ లేకుండా పరిశోధనలు చేయడమా, లేక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పరి శోధనలు చేయడమా అన్నది మనం నిర్ణయించుకోవాలి.
దేశంలో మౌలిక శాస్త్ర పరిశోధనలు, అప్లైడ్ రీసెర్చ్ రెండూ వేర్వేరుగా ఎవరికి వారు చేసుకుంటున్నారు. ఈ అంతరం చెరిగి పోవాలి. ‘సైకిల్స్ ఆఫ్ ఇన్వెన్ష్షన్స్ అండ్ డిస్కవరీ’ పుస్తకంలో వెంకటేశ్ నారాయణ మూర్తి (హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్స్ మాజీ డీన్) బేసిక్, అప్లైడ్ రీసెర్చ్ రెండింటి మేళవింపుతోనే మేలైన çసృజన సాధ్యమంటారు. ఉదాహరణకు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు జన్యుక్రమ నమోదు వెయ్యి రెట్లు వేగవంతం అయ్యింది.
ఎందుకంటే శంకర్ బాల సుబ్రమణ్యన్ , డేవిడ్ క్లె్లనెర్‌మాన్ కలిసికట్టుగా చేసిన ‘సరళమైన’ రసాయన శాస్త్ర ఆవిష్కరణ ఇందుకు దోహదప
డింది. వీళ్లు అంతకుముందరి మైక్రోఫ్లూయిడ్స్, లేజర్, కంప్యూటింగ్ లాంటి సాంకేతిక విజ్ఞానం మీద ఆధారపడి ఈ పనిచేయగలిగారు.
అందుకే బేసిక్, అప్లైడ్ పరిశోధనల్లో ఏది ఎంపిక చేసుకోవాలి అన్న ప్రశ్న అర్థరహితం. ట్రాన్స్‌లేషనల్ రీసెర్చ్ వేగంగా ఫలితాల నిస్తుంది. మరోవైపు మౌలిక శాస్త్ర పరిశోధనలకు ఉన్న సామర్థ్యం చాలా ఎక్కువ. మధ్య, దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఇది భారతదేశానికి బాగా అక్కరకొచ్చే విషయం. రెండింటిపైనా పెట్టుబడులు పెట్టాలన్న దానికి రెండు వాదనలు ఉన్నాయి. తరచూ వినిపించే విమర్శల గురించి కూడా చూద్దాం. మొదటి వాదన... కీలకమైన, ఓపెన్ ఎండెడ్ పరిశోధనలపై భారత్ డబ్బు ఖర్చుపెట్టదు అన్నది. పరిశోధనలపై పెట్టే ఖర్చు గణనీయంగా పెరగాలనే విషయాన్ని మేము అంగీక రిస్తున్నాం. అయితే నిధులు సమర్థంగా ఖర్చు పెట్టడం ఎలా అన్న విష యంలో మనం ఇంకా ఎంతో పురోగతి సాధించవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ నిధుల్లో సింహభాగం ప్రభుత్వ పరిశోధన సంస్థలకే వెళుతోంది. యూనివర్సిటీలకు దక్కుతున్నది కేవలం 10–15 శాతం మాత్రమే. ఈ మోతాదు అమెరికాలో 63 శాతం వరకూ ఉంటే, యునైటెడ్ కింగ్‌డమ్‌లో 80 శాతం, దక్షిణ కొరియాలో 50 శాతంఉండటం గమనార్హం. ‘ఫాస్ట్ ఇండియా’ ఇటీవల సిద్ధం చేసిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ సైన్స్ ఇన్ ఇండియా’ నివేదిక ప్రకారం దేశంలోని అత్యున్నత సంస్థలు కూడా పరిపాలనపరమైన అడ్డంకుల కారణంగా పరిశోధనలకు నిధులు సేకరించలేకపోతున్నాయి. ఖర్చు కూడా పెట్టలేకపోతున్నాయి.
వనరుల కేటాయింపును సమర్థంగా చేసి పరిశోధనలకు నిధులి వ్వడంలోనూ పోటీతత్వాన్ని తెస్తే ఓపెన్ ఎండెడ్ రీసెర్చ్ పుంజుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో ఇప్పటికే కొంత కదలిక కనపడుతోంది. రక్షణ రంగ పరిశోధనలకు సంబంధించిన బడ్జెట్‌లో 25 శాతాన్ని డీఆర్‌డీఓ ప్రయోగశాలల్లో కాకుండా, యూనివర్సిటీలు, పరి శ్రమకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఇక రెండో వాదన గురించి... దీని ప్రకారం పాశ్చాత్య దేశాలు ఖరీదైన ఓపెన్ ఎండెడ్ రీసెర్చ్ ఇప్పటిలాగే కొనసాగించాలి. భారత దేశం ఆ పరిశోధనలను ఆవిష్కరణలుగా మార్చే ప్రయత్నించాలి. ఈ వాదన మనకు ఉపయోగపడదు. ఎందుకంటే... ఓపెన్ ఎండెడ్ పరిశో ధనలను ఆవిష్కరణలుగా మార్చేందుకు ఆయా నిర్దిష్ట అంశాలపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, అది కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండాలి. ఉదాహరణకు, కృత్రిమ మేధ రంగంలో 2012లోనే కీలక పరిశోధనలు జరిగినా, ఐటీ దిగ్గజంగా ఉన్నా భారత్ ఆ రంగంలోకి చెప్పుకోదగ్గ స్థాయిలో భాగస్వామి అయ్యేందుకు పదేళ్లు పట్టింది.
ఎందుకంటే కృత్రిమ మేధ రంగంలో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు తగినంత మంది భారత్‌లో లేకపోవడమే. క్వాంటమ్ కంప్యూటింగ్, న్యూరోసైన్స్, అంతరిక్షం, జన్యుశాస్త్ర రంగాల్లోనూ మనకు ఇదే రక మైన అనుభవాలు ఉన్నాయి. ఓపెన్ ఎండెడ్ పరిశోధనల్లో మన సామ ర్థ్యాన్ని పెంచుకోకపోతే మనం ఇతరులను అనుసరించే వారిగానే మిగిలిపోతాం. నేతృత్వం వహించే స్థాయికి ఎదగలేము. చివరగా... ప్రపంచ సమస్యలను భారత్ పరిష్కరించాలా అన్న ప్రశ్నను పరిశీలిస్తే... ఈ ప్రశ్న ఎక్కువగా ట్రాన్స్‌లేషనల్ రీసెర్చ్ నేప థ్యంలో వస్తూంటుంది. ఇది దేశానికి ఉపయోగపడే, తొందరగా సాధించగలిగే విషయం. మన పరిశోధనలు భారత్‌తో పాటు అంత ర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై కూడా దృష్టి పెట్టాలి. గంగానదిని సమర్థంగా శుద్ధి చేయగలిగితే... అది ప్రపంచవ్యాప్తంగా కలుషిత జలాల శుద్ధికి ఉపయోగపడుతుంది కదా! ఇలాంటి పలు అంశాలను భారతీయ శాస్త్రవేత్తలు చేపట్టాలి. ఇవి మన ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచుతాయి.
కె. విజయ్ రాఘవన్ , ‘ఫాస్ట్ ఇండియా’ ఛైర్మన్ ; కేంద్ర మాజీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు; వరుణ్ అగర్వాల్, ‘ఫాస్ట్ ఇండియా’ సహ వ్యవస్థాపకుడు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment