
మా పాఠశాలలో గతంలో 28 ఏళ్లపాటు ప్రత్యేక తరగతులు కొనసాగాయి. ప్రస్తుతం విద్యార్థులు ఇళ్లకు వెళ్లాక టీవీలు, ఫోన్లకు అలవాటు పడుతున్నారు. చదువుపై శ్రద్ధ పెట్టడం లేదు. దీంతో విద్యాప్రమాణాలు సన్నగిల్లడాన్ని గమనించాం. అందుకే పేరెంట్స్ కమిటీతో చర్చించి, తల్లిదండ్రులను ఒప్పించి విద్యా వలంటీర్ విధానాన్ని తెచ్చాం. ఎంతో మంది విద్యావేత్తలు, నిపుణులు మేం చేసిన ప్రయోగాన్ని ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వం విద్యావ్యవస్థ అభివృద్ధికి చేస్తున్న కృషి భేష్. నాడు–నేడుతో పాఠశాలలో ఎన్నో వసతులు సమకూరాయి. ఇక్కడ అమలవుతున్న వలంటీర్ వ్యవస్థను అన్ని పాఠశాలల్లో అమలు చేస్తే బాగుంటుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
– ఏ.ధర్మారెడ్డి,
గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్
పాఠశాలలో అందిస్తున్న విద్య బాగుంది. అయితే ఇళ్లకు వెళ్లిన విద్యార్థులను ఇంటి దగ్గర చదివించే పరిస్థితులు లేకపోవడంతో తల్లిదండ్రులను ఒప్పించి, ఈ విధానాన్ని ప్రవేశపెట్టాం. 6,7,8,9 తరగతుల వారీగా తల్లిదండ్రుల సహకారంతో నిర్విరామంగా దీనిని ముందుకు తీసుకెళుతున్నాం. విద్యార్థులకు కూడా ఇది మంచి అవకాశం. మంచి ఉత్తీర్ణతకు వెసులుబాటుగా ఉంటుంది.
– కొండమడుగుల నాగజ్యోతి,
పేరెంట్స్ కమిటీ చైర్‌పర్సన్
