
పట్నంబజారు: రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 175, 25 పార్లమెంట్ స్థానాలకు 25 కై వసం చేసుకుని, రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని శాసనమండలి విప్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని బ్రాడీపేటలో శిఖాకొల్లి జ్వాలా నరసింహారావు నివాసంలో వైఎస్సార్ సీపీ ఆత్మీయ సమావేశం శుక్రవారం నిర్వహించారు. సవవవేశానికి విప్ లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడదల రజిని, పొన్నూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోశయ్య, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ హాజరయ్యారు.
● ఈ సందర్భంగా విప్ అప్పిరెడ్డి మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేశ్, పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోవడం ఖాయమని చెప్పారు. ఇది ప్రఖ్యాత సర్వేలన్నీ తేల్చి చెప్పిన నిజమని వివరించారు. జయప్రదంగా జరిగిన జగనన్న సిద్ధం సభలు, ప్రస్తుతం జరుగుతున్న బస్సు యాత్రకు ఊళ్లకు ఊళ్లు తరలివస్తున్న తీరు, మండుటెండలు, అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడా లేకుండా జగనన్నను కన్నులారా చూసేందుకు పోటెత్తుతున్న జన సంద్రాన్ని చూసి కూటమికి అప్పుడే ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే ఒక్క చంద్రబాబు మాత్రమే కాక సాక్ష్యాత్తు ఆయన వదిన అయిన బీజేపీ నేత పురందేశ్వరి చివరికి అధికారులపై కూడా పిటిషన్లు పెట్టే స్థాయికి దిగజారినట్లు ఆరోపించారు.
● సీఎం జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ఇంటి వద్దకు పాలన.. ఇంటింటా సంక్షేమం దిగ్విజయంగా కొనసాగుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడదల రజిని వెల్లడించారు. ప్రజలే నేరుగా సీఎం వైఎస్ జగన్ కావాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఇంటి వద్దకు పాలన చేరువ చేసిన గొప్ప ముఖ్యమంత్రిగా జగనన్న అని కొనియాడారు. వలంటీర్ వ్యవస్థను కూటమి నేతలంతా కలిసి కక్షపూరితంగా వ్యవహరించడం ద్వారా ఆంక్షలతో అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. ఫలితంగా ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో ప్రజలే స్వయంగా చూస్తున్నారని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ఇలాంటి ఎన్నో ఇక్కట్లకు ఇలా గురవుతూనే ఉండాల్సి వస్తుందన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తెరిగినట్లు ఆమె చెప్పారు. సీఎం జగనన్న పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు పూర్తి సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు సీఎం జగన్ పెద్ద పీట వేయడంతో పాటు ప్రత్యేకించి మహిళల రక్షణకు, మహిళా సాధికారతకు ఆయన కృషి చేసిన తీరు అనిర్వచనీయమన్నారు. అమ్మ ఒడి తదితర పథకాల ద్వారా చివరికి చిన్న పిల్లల హృదయాలలో కూడా చెరగని ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రిగా జగనన్న సరికొత్త చరిత్ర సృష్టించారని వివరించారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయనను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నట్లు మంత్రి విడదల రజిని ప్రకటించారు.
● గుంటూరు లోక్‌సభ అభ్యర్థి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య మాట్లాడుతూ దేశంలోనే మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కొనియాడారు. ఓ వైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని కూడా సీఎం సవ్యంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి పునాది వేయడం ద్వారా దేశంలోనే ది బెస్ట్ రాష్ట్రంగా ఏపీని నిలిపారన్నారు. ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న చంద్రబాబు ముందు రాష్ట్రాభివృద్ధికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ బసివిరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరరామశర్మ, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, గీతామందిరం చైర్మన్ వెలుగూరి రత్నప్రసాద్, మిర్చి యార్డు మాజీ చైర్మన్ మద్దిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు నూనె ఉమామహేశ్వరరెడ్డి, బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, వలివేటి వెంకటరమణ, అరవ తిమ్మరాజు, మన్నేపల్లి హనుమంతరావు, జక్కా శ్రీను, మహేంద్ర గులేచా, అత్తోట జోసఫ్, డేవిడ్, మేడా సాంబశివరావు, జగన్ కోటి, కొత్తపేట సతీష్, జాన్సీ, విజయమాధవి, సత్యవతి, విజయమ్మ, వనజాక్షి, ఆలా కిరణ్, మాదాసు కిరణ్, సింగు నరసింహారావు పాల్గొన్నారు.
కుప్పంలో బాబు, మంగళగిరిలో
లోకేశ్, పిఠాపురంలో పవన్ ఔట్
సర్వేల సారాంశం తెలిపిన
ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి
ఇంటి వద్దకే పాలన–
ఇంటింటా సంక్షేమం
కొనసాగాలంటే మళ్లీ జగన్ సీఎం
కావాల్సిందే: మంత్రి విడదల రజిని
Comments
Please login to add a commentAdd a comment