ముగిసిన గంగాదేవి తిరునాళ్ల
అచ్చంపేట: ఓర్వకల్లులో గత మూడు రోజులుగా జరుగుతున్న స్వయంభు గంగాదేవి పేరంటాళమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. అమ్మవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను దేవదాయశాఖ, ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో లెక్కించారు. హుండీ ఆదాయం రూ.5,05,497 రాగా, అమ్మవారి దర్శన టిక్కెట్ల రూపంలో రూ.74,340 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.కోటేశ్వరరావు తెలిపారు. ఆలయం వద్ద దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు నెమలికల్లుకు చెందిన తుమ్మా నరేంద్రరెడ్డి పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. రుద్రవరం గ్రామస్తులు అమ్మవారి ఉత్సవాలకు గంగమ్మతల్లి ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించి ఉరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో దేవదాయశాఖ సత్తెనపల్లి డివిజన్ ఇన్‌స్పెక్టర్ వి.లీలావతి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నేడు శివరాత్రి ఉత్సవాలపై సమీక్ష
అమర్తలూరు: మహాశివరాత్రి తిరునాళ్ల విజయవంతం చేసేందుకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని గోవాడ బాల కోటేశ్వర స్వామి దేవస్థానం కార్య నిర్వహణాధికారి అశోక్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోవాడ బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం ఉదయం 11 గంటలకు రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి రామలక్ష్మి సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని కోరారు.
గుంటూరు డీవైఈవోగా ఏసురత్నం
గుంటూరు ఎడ్యుకేషన్ : గుంటూరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారిగా నియమితులైన సీనియర్ ఎంఈవో జి. ఏసురత్నంకు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక అభినందనలు తెలియజేశారు. శుక్రవారం డీఈవో కార్యాలయంలో గుంటూరు డీవైఈవోగా పూర్తి అదనపు బాధ్యతల (ఎఫ్‌ఏసీ)పై నియమితులైన జి. ఏసురత్నం డీఈవో రేణుకను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు ఏ.తిరుమలేష్, ఎంఈవో అబ్దుల్ ఖుద్ధూస్, ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం పాల్గొన్నారు.
చిరుమామిళ్లలో ఆలయాల వార్షికోత్సవం
నాదెండ్ల: చిరుమామిళ్ళ గ్రామంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, శివాలయం వార్షికోత్సవాలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఎస్టీ కాలనీలోని శివాలయం, నాదెండ్ల డొంకరోడ్డులోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాలను 2019లో గ్రామానికి చెందిన విద్యాదాత నడికట్టు రామిరెడ్డి తన సొంత నిధులతో నిర్మించారు. ప్రత్యేక పూజల్లో నడికట్టు రామిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అన్నదానం నిర్వహించారు. ఆయన వెంట కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడు సిరిపురపు అప్పారావు, గ్రామస్తులు యన్నం శివారెడ్డి, మద్దూరి భాస్కరరెడ్డి, అప్పిరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, మిట్టపాలెపు వెంకటేశ్వరరావు, భవనం శ్రీనివాసరెడ్డి, కమ్మ సీతయ్య, నర్రా శ్రీనివాసరావు, వీరారెడ్డి పాల్గొన్నారు.
రూ.50 వేలు మించి నగదు ఉండరాదు
లక్ష్మీపురం: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నియమావళి అమలులో ఉందని, తగిన ఆధారం లేకుండా రూ.50 వేలకు మించి ఎవరూ నగదు కలిగి ఉండరాదని సహాయ రిట ర్నింగ్ అధికారి, డీఆర్‌ఎం షేక్ ఖాజావలి శనివారం తెలిపారు. నిబంధనలు పాటించకుంటే నగదును జప్తు చేస్తామని పేర్కొన్నారు.
ముగిసిన గంగాదేవి తిరునాళ్ల
ముగిసిన గంగాదేవి తిరునాళ్ల
Comments
Please login to add a commentAdd a comment