జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్
క్వారీ తిరునాళ్లకు పటిష్ట బందోబస్తు
చేబ్రోలు: మహాశివరాత్రి సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్లకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్వామి వారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 26వ తేదీన జరిగే తిరునాళ్లకు బందోబస్తు, గుడి వద్ద ఏర్పాట్లు, ఫెన్సింగ్, ట్రాఫిక్, ప్రభలు నిలుపు ప్రదేశాలు తదితరాలను ఆయన పరిశీలించారు. దేవదాయ, ఇతర శాఖల అధికారులతో చర్చించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పొంగళ్ళు, నైవేద్యాలు సమర్పించే ప్రదేశం, చిన్న దుకాణాల ఏర్పాటు ప్రాంతాలను పరిశీలించారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రదేశాలను కేటాయించాలని సూచించారు. గుంటూరు – తెనాలి ప్రధాన రహదారి వెంట ఆలయం ఉండటంతో ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రభల నిర్వాహకులకు నిర్ణీత స్థలం కేటాయించాలని, డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టాలని తెలిపారు. తర్వాత దీప స్తంభ నిర్మాణానికి ఎస్పీ భూమిపూజ చేశారు. నారకోడూరు ప్రధాన జంక్షన్ వద్ద, నారా కోడూరు – తెనాలి రహదారిపై ట్రాఫిక్ నియంత్రణకు సూచనలు చేశారు. ట్రైనీ ఐపీఎస్ దీక్ష, తెనాలి డీఎస్పీ జనార్దన్‌రావు, దేవదాయ శాఖాధికారి పోతుల రామకోటేశ్వరావు, పొన్నూరు రూరల్ సీఐ వై కోటేశ్వరరావు, ఎస్‌ఐ డీవీ కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment