సత్రశాలలో మహాశివరాత్రికి పకడ్బందీ ఏర్పాట్లు
దేవదాయశాఖ డెప్యూటీ కమిషనర్ బసవ శ్రీనివాసరావు
సత్రశాల(రెంటచింతల): మహాశివరాత్రి పర్వదినం పురష్కరించుకుని ఫిబ్రవరి 26న సత్రశాల గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించాలని గుంటూరు దేవదాయశాఖ డెప్యూటీ కమిషనర్ కామినేని బసవ శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం స్థానిక దేవస్థానం ప్రాంగణంలో ఆయన ఎండోమెంట్ ఈఓ గాదె రామిరెడ్డితో మహాశివరాత్రి ఏర్పాట్లపై చర్చించి పలు సూచనలు చేశారు. సత్రశాల వరకు ఉన్న రహదారికి ఇరువైపులా ఉన్న గుంతలను వెంటనే పూడ్చే పనులు చేపట్టాలని ఆదేశించారు. ముందుగా ఆయన దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట అర్చకులు మల్లికార్జునశర్మ నీలం మల్లయ్య, మున్నా లింగయ్య తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment