మహిళా రేషన్ డీలర్‌కు బెదిరింపులు
ఫిరంగిపురం: ఎన్నో ఏళ్లుగా రేషన్ దుకాణం నిర్వహిస్తున్న మహిళను బెదిరించిన ఘటన మండలంలోని వేములూరిపాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన పి.కామేశ్వరి బీఏ బీఈడీ చేసింది. బీసీ కోటాలో ఎంతో కాలంగా రేషన్ దుకాణం నిర్వహిస్తోంది. కాగా నాలుగురోజుల కిందట గ్రామానికి చెందిన కొందరు వచ్చి రాజకీయ కారణాలతో రేషన్ డీలర్‌షిప్‌కు రాజీనామా చేయాలని హెచ్చరించారు. తరువాత రోజు గ్రామానికి చెందిన ఓ యువకుడు మధ్యాహ్నం రేషన్‌దుకాణం మూసి భోజనానికి ఇంటికి వెళ్లిన సమయంలో రేషన్ దుకాణం వద్ద ఆటోలో తెచ్చిన పది బస్తాలు రేషన్ బియ్యం పడేసి వెళ్లినట్లు బాధితురాలు చెబుతోంది. కొద్దిసేపటికే సీఎస్‌డీటీ వచ్చి దుకాణం పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేశారు. సీఐకి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు. దీనిపై సీఎస్‌డీటీని ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment