చందోలు(కర్లపాలెం): పెండింగ్ కేసులు త్వరగా దర్యాప్తు చేసి పరిష్కరించాలని బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు ఆదేశించారు. చందోలు పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం డీఎస్పీ రామాంజనేయులు ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు తనిఖీ చేసి పెండింగ్ కేసుల పరిష్కరించేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర మోటారు వాహనాలపై ప్రయాణించే వారు హెల్మెట్ పెట్టుకునే విధంగా కారులో ప్రయాణించే వారు సీటు బెల్టు పెట్టుకునే విధంగా సిబ్బంది అవగాహన కల్పించాలని చెప్పారు. మండలంలో కోడి పందేలు, పేకాటలపై నిఘా ఉంచాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఆర్.స్వామి శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.
డీఎస్పీ రామాంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment