ఇకపై వారానికోసారి సివిల్ పోలీసులకు పరేడ్
తెనాలి రూరల్: పరేడ్‌తో క్రమశిక్షణ అలవడుతుందని, ఇప్పటివరకూ ఏఆర్ సిబ్బందికే ఉన్న ఈ పరేడ్ ఇకపై సివిల్ పోలీస్‌లకూ నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ తెలిపారు. స్థానిక వీఎస్‌ఆర్ అండ్ ఎన్‌వీఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో శుక్రవారం పోలీస్ పరేడ్ నిర్వహించారు. తెనాలి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అడిషనల్ ఎస్పీ(ఏఆర్) హనుమంతు, ట్రైనీ ఐపీఎస్ దీక్ష, తెనాలి డీఎస్పీ బి.జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది పరేడ్ నిర్వహిస్తూ ఎస్పీకి గౌరవ వందనం చేశారు. మార్చ్ ఫాస్ట్, వెపన్ డ్రిల్, పోలీస్ బ్యాండ్ ఆకట్టుకున్నాయి. ఆర్‌ఎస్‌ఐ సంపంగిరావు సెరిమోనియల్ పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు విధుల్లో భాగంగా ప్రతి శుక్రవారం పోలీస్ పరేడ్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐలు వి.మల్లికార్జునరావు, కె. రాములు నాయక్, ఎస్.రమేష్ బాబు, ఏఆర్ సీఐలు, ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment