దామోదరం సంజీవయ్యకు నివాళి
నగరంపాలెం: ఏపీకి అతి చిన్న వయసులో దామోదరం సంజీవయ్య సీఎం అయి చరిత్ర పుటల్లో నిలిచారని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. ఏపీకి తొలి దళిత సీఎంగా చేసిన దామోదరం సంజీవయ్య జయంతి శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణ నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చిన్నతనంలో తండ్రి మరణించినా సోదరుని సహకారంతో విద్యనభ్యసించారని అన్నారు. అనేక ఉద్యోగాలు నిర్వర్తించి, న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారని పేర్కొన్నారు. రాజకీయ నేతగా ఎదిగిన ఆయన పిన్న వయసులో సీఎంగా చేశారని అన్నారు. ఆయన హయాంలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ త్వరగా అందుబాటులోకి వచ్చేందుకు విశేష కృషి చేశారని వివరించారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, ఎంటీ ఆర్‌ఐ శ్రీహరిరెడ్డి, పీఆర్‌ఓ తెనాలి విజయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment