విశ్వకర్మను పూజిస్తే సకల శుభాలు
తెనాలి: శ్రీవిరాట్ విశ్వకర్మను పూజించటం వల్ల సకల శుభాలు కలుగుతాయని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ క్షేత్రానికి పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామి) అన్నారు. పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా తెనాలి వచ్చిన ప్రజ్ఞానంద సరస్వతి రెండోరోజైన ఆదివారం స్థానిక కొత్తపేటలోని శ్రీవిరాట్ విశ్వకర్మ దేవస్థానానికి విచ్చేశారు. విశ్వకర్మకు, కామాక్షి అమ్మవారికి, దాసాంజనేయస్వామికి హారతి ఇచ్చి, ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ప్రవచించారు. శ్రీవిరాట్ విశ్వకర్మ దేవాలయంలో ఆరికట్ల వెంకటేశ్వరరావు అర్చకత్వం చేసినరోజుల్లో తాను వారి శిష్యరికంలో పూజాకార్యక్రమాలు నిర్వహించినట్టు గుర్తుచేసుకున్నారు. వెంకటేశ్వరరావు కాలం చేశాక, తాను అర్చకత్వ బాధ్యతను స్వీకరించి కొంతకాలం ఆ బాధ్యతలను నిర్వర్తించానని చెప్పారు. ఆ కారణంగానే శ్రీవిరాట్ విశ్వకర్మ, కామాక్షి అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఆలయానికి వచ్చినట్టు వివరించారు. కార్యక్రమంలో దేవాలయం ఈవో ఎన్‌వీఎన్ మల్లేశ్వరి, అర్చకుడు టీవీఎల్ కాంతారావు, కమిటీ సభ్యులు తాళాబత్తుని ఉదయశంకర్, మానేపల్లి జేజిబాబు, జి.సాయి, లక్ష్మీపతి, జి.అర్జున్, సాయి ఈశ్వరశర్మ, కె.నరేంద్ర, ముద్దాభక్తుని రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment