లక్ష్మీపురం: మహిళ హ్యాండ్ బ్యాగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయిన ఘటనపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. గోరంట్ల గ్రామానికి చెందిన సాయి పూజ ఈనెల 14న అరండల్‌పేట 5/5లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు వచ్చింది. పలు పరీక్షలు చేయించుకునే క్రమంలో మెడలో ఉన్న 20 గ్రాముల బంగారు గొలుసును బ్యాగ్‌లో పెట్టుకుంది. రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు రోడ్డు పైకి వచ్చింది. ఈ సమంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి హ్యాండ్ బ్యాగ్‌ను లాక్కొని పరారైయ్యారు. దీంతో పూజ కేకలు పెట్టడంతో స్థానికులు పట్టుకునే యత్నం చేసేలోగా పరారైయ్యారు. సమాచారం తెలుసుకున్న అరండల్‌పేట పోలీసులు ఘటనా స్థలంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. బ్యాగ్‌లో ఉన్న 20 గ్రాముల బంగారు గొలుసు, రూ.15వందల నగదు, సెల్‌ఫోన్ ఉన్నట్లు బాధితురాలు తెరుకుని శనివారం రాత్రి అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment