బీసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
తెనాలి: త్వరలో రానున్న బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎన్నికల్లో బీసీ సబ్‌ప్లాన్‌తో ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారని, ఈ మేరకు బడ్జెట్‌లో రూ.30 వేల కోట్లు కేటాయించాలని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు గతంలో మాదిరిగా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పింఛను ఇస్తామన్న హామీని నిలుపుకోవాలని కోరారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అక్రమ తవ్వకాలపై మైనింగ్ అధికారుల దాడులు
గుంటూరు రూరల్: నగర శివారుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలపై ఆదివారం మైనింగ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ ఆదేశాల మేరకు అధికారులు, జిల్లా మైనింగ్ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. గుంటూరు వెస్ట్ మండలం చౌడవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 104లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నట్లుగా వచ్చిన ఫిర్యాదుపై తనిఖీలు చేశారు. పుప్పాల గోపీకృష్ణ అలియాస్ ఆడిటర్ గోపీకృష్ణ అక్రమంగా మైనింగ్‌కి పాల్పడుతున్నట్లు గుర్తించారు. మట్టి తవ్వకాలు చేస్తున్న పొక్లెయిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి నల్లపాడు పోలీసులకు అప్పగించారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
పిడుగురాళ్ల: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల ఎస్‌ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లి గ్రామంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న మసీదు ఎదురు సిమెంట్ బెంచీ మీద గుర్తు తెలియని సుమారు 35 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి మృతి చెంది ఉన్నాడని గుర్తించామన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
బీసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Comments
Please login to add a commentAdd a comment