విక్రయాలు బక్క చిక్కెన్!
నరసరావుపేట: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధితో లక్షలాది కోళ్లు చనిపోవడం, ఆయా జిల్లాల్లో చికెన్, గుడ్ల విక్రయాలు నిలిపేయడం, జనంలో నెలకొన్న భయాందోళనలు వెరసి వీటన్నిటి ప్రభావం జిల్లాలోని చికెన్ విక్రయాలపై పడింది. జిల్లాలో ఎక్కడా బర్డ్‌ఫ్లూ లేదని, 100 డిగ్రీల మంటపై వండిన చికెన్‌ను తినవచ్చని పశుసంవర్ధకశాఖ అధికారులు ప్రకటించినా ప్రజలు పట్టించుకోలేదు. ఈ ఆదివారం కొద్ది బేరం తప్పితే చికెన్‌షాపులు అన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. అయితే మటన్, చేపలు, రొయ్యలు విక్రయించే దుకాణాలు మాంసం ప్రియులతో కిటకిటలాడాయి. పట్టణ పరిధిలోని వినుకొండ రోడ్డు, కలెక్టరేట్ రోడ్డు, పల్నాడు రోడ్డు, సత్తెనపల్లి రోడ్డు, గుంటూరు రోడ్డు, మాంసం మార్కెట్, మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న చికెన్ దుకాణాలు వెలవెలబోవగా, ఆ పక్కనే ఉన్న మటన్ దుకాణాలు, మినీ వ్యాన్‌లలో చేపలు విక్రయించే మినీ వ్యాన్‌ల వద్ద జనం రద్దీ కనిపించింది. ప్రజల్లో బర్డ్‌ఫ్లూ భయాందోళనలు నెలకొన్నా.. చికెన్ ధరలు స్వల్పంగానే తగ్గడం గమనార్హం. గత ఆదివారం కేజీ రూ.260కు విక్రయించిన వ్యాపారులు ఈ ఆదివారం స్కిన్‌తో రూ.220, స్కిన్‌లెస్ రూ.240లని బోర్డులు వేలాడ దీశారు. మటన్ కేజీ రూ.900లకు విక్రయించగా, చేపలు రాగండి కిలో రూ.180, బొచ్చె రూ.220, కొరమేను రూ.500కు విక్రయించారు.
బర్డ్‌ప్లూ భయంతో
చికెన్ దుకాలు వెలవెల
మటన్, చేపలు, రొయ్యలవైపునకు మళ్లిన మాంసం ప్రియులు
Comments
Please login to add a commentAdd a comment