పురుగు మందు తాగి కౌలురైతు మృతి
ఫిరంగిపురం: పురుగు మందు తాగి కౌలు రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని కండ్రికలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తుపాకుల లింగయ్య(41) పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుంటాడు. ఈ ఏడాది కూడా మూడు ఎకరాల మిర్చి, నాలుగు ఎకరాల పత్తి, ఎకరన్నర మాగాణి వేశాడు. మిర్చికి సరైన ధర లేకపోవడం, పత్తి దిగుబడి సరిగారాకపోవడంతో బాధపడుతున్నాడు. ఇప్పటికే సుమారు రూ.15లక్షల వరకు అప్పులు ఉండటంతో తీవ్రంగా మనస్తాపం చెందుతున్నాడు. దీంతో శనివారం సాయంత్రం వేమవరం వెల్లే దారిలోని పొలం సమీపంలో పురుగుమందు తాగి పడిపోయాడు. గమనించిన గొర్రెల కాపరులు గ్రామస్తులకు తెలియజేయడంతో బంధువులు వచ్చి లింగయ్యను చికిత్స కోసం నరసరావుపేటకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం పోస్టుమార్టం చేయించారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment