విద్యుత్ నెట్ వర్క్‌లో ఏఐ ఆధారిత పరిష్కారాలపై సదస్సు
పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఎనర్జీ డిస్‌ఎగ్రిగేషన్ ఏఐ బేస్డ్ సొల్యుషన్ మెథడ్స్ అండ్ అప్లికేషన్స్ అంశంపై అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యవక్తగా సౌత్ కొరియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ రామ్మోహన్ మల్లిపెద్ది హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎనర్జీ డిస్‌ఎగ్రిగేషన్ పద్ధతి అంటే కరెంట్ మీటర్ నుంచి కరెంటు పరికరాల శక్తి వినియోగాన్ని వేరు చేసే ఓ టెక్నిక్ అని తెలిపారు. శక్తి వినియోగంలో ఆధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్ ఉపయోగించి ఉపకరణాల వినియోగాన్ని పూర్తిస్థాయిలో విశ్లేషించవచ్చని దాని ద్వారా ఉపకరణాల పనితీరును మెరుగుపరుచుకోవడం శక్తి వినియోగాన్ని తగ్గించుకోవడం చేయవచ్చన్నారు. ఉపకరణాల వినియోగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌న్స్ వినియోగం ద్వారా పనితీరుకు సరిపడా శక్తిని అందించబడుతుందని వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, అకడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ ఏవీ సరేష్ బాబు, డాక్టర్ సీహెచ్ నాగసాయి కళ్యాణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment