డాక్టర్ కవితకు అరుదైన అవార్డు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి(జీజీహెచ్) గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ ముక్కు కవిత, కేంద్ర మంత్రి కె.రామమోహన్ నాయుడు చేతుల మీదుగా అరుదైన పురస్కారం అందుకున్నారు. టైమ్స్ నెట్‌వర్క్ ఇండియా హెల్త్ కేర్ అవార్డుల పురస్కారం ఆదివారం వైజాగ్‌లో నిర్వహించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన కృషి చేసినందుకు మార్గదర్శకులను గుర్తించి అవార్డులను అందజేస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ భవిష్యత్‌ను రూపొందించడంలో మెరుగైన పాత్ర వహించి గణనీయమైన కృషి చేసినందుకు డాక్టర్ కవితకు అవార్డు లభించింది. అవార్డు అందుకున్న డాక్టర్ కవితకు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ, వైద్య కళాశాల, జీజీహెచ్‌కు చెందిన పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది సోమవారం అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment