ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్గదర్శకాలు తప్పనిసరి
లక్ష్మీపురం: ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా కొనసాగేలా ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రకారం పనిచేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్లో ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడిండ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఉదయం 8 గంటల సమయానికి ఓటింగ్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ప్రిసైడింగ్ అధికారి డైరీతో పాటు, ఇతర నాన్ స్టాట్యూటరీ, స్టాట్యూటరీ ఫారాలను సక్రమంగా పూర్తి చేసుకొని, బ్యాలెట్ బాక్స్‌లు సక్రమంగా సీజ్ చేసి రిసెప్షన్ కేంద్రాల్లో అప్పగించాలని ఆదేశించారు. పోలింగ్ విధులు కేటాయించిన ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులను ఫిబ్రవరి 20వ తేదీ నాటికి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందేలా పోస్ట్ ద్వారా కాని, స్వయంగా కాని అందించాలని కోరారు. సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ మాట్లాడుతూ ప్రిసైడింగ్ అధికారులు ఇతర పోలింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పోలింగ్ మెటీరియల్ తీసుకునేటప్పుడు, పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి అన్ని అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి పాల్గొన్నారు.
పది పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లు
పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్‌న్స్ హాలులో పరీక్షల నిర్వహణపై జిల్లా అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పరీక్షలు మార్చి 17వ తేదీ ప్రారంభమవుతాయని చెప్పారు. రెగ్యులర్ విద్యార్ధులు 29,499 మంది, ప్రైవేటు 961 మంది విద్యార్ధులు మొత్తం 30,460 మంది విద్యార్ధులు 150 పరీక్ష కేంద్రాలలో పరీక్షలకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లాలో సమస్యాత్మకంగా గుర్తించిన పరీక్ష కేంద్రాలు వద్ద ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. పరీక్షలలో మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్ జరగకుండా విద్యా శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ గంగరాజు, డ్వామా పీడీ శంకర్, జిల్లా విద్యా శాఖ అధికారి రేణుక, డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, ఎంవీఐ గోపాల్, నగరపాలక సంస్థ డెప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, సీపీడీసీఎల్ డీఈ ప్రసాద్, జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ కమిషనర్ వెంకటరెడ్డి, గుంటూరు పోస్టల్ శాఖ ఇన్ స్పెక్టర్ రవిశేఖర్, తెనాలి అసిస్టెంట్ సూపరింటెండెంట్ పాంచజన్య రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజరు డి.ఆదినారాయణ పాల్గొన్నారు.
స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానం సక్రమంగా అమలు జరపాలి
పర్యాటక రంగం అభివృద్ధి కోసం అతిధి గృహాల్లో సురక్షితమైన పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చేందుకు ప్రవేశ పెట్టిన స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానంను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా అమలు జరిగేలా పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెనన్స్ హాలులో స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానం(ఎస్ జీ ఎల్ ఆర్ ఎస్) జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలసి పాల్గొన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కళ్యాణ చక్రవర్తి, జిల్లా పరిషత్ సీఈఓ జ్యోతిబసు, ఆర్డీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎన్నికల అధికారులకు శిక్షణ
Comments
Please login to add a commentAdd a comment