ఉత్తమ ప్రదర్శన ఇంద్రప్రస్థం
నరసరావుపేట ఈస్ట్: నరసరావుపేట రంగస్థలి 45వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, రంగస్థలి సంయుక్త ఆధ్వర్యంలో మూడురోజుల పాటు నిర్వహించిన 24వ జాతీయస్థాయి ఆహ్వాన తెలుగు నాటిక పోటీలు గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ఇంద్రప్రస్థం నాటిక ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. రెండో ఉత్తమ ప్రదర్శన బహుమతి గుంటూరు అమరావతి ఆర్ట్స్ వారి చిగురు మేఘం నాటికకు లభించింది. ఉత్తమ నటుడుగా హైదరాబాద్ కళాంజలి వారి అన్నదాత నాటికలో అంకమ్మతాత పాత్రదారి చెంచు పున్నయ్య, ఉత్తమ నటిగా కాకినాడ జి.వి.కె.క్రియేషన్స్ వారి తితిక్ష నాటికలో భారతి పాత్రదారి ఎస్.జ్యోతిరాణి, ఉత్తమ విలన్‌గా వెలగలేరు ఆర్ట్స్ థియేటర్ వారి రాత నాటికలో అజయ్ పాత్రదారి పవన్‌కళ్యాణ్ ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడు బహుమతి ఇంద్రప్రస్థం దర్శకుడు ఎన్.రవీంద్రరెడ్డి కై వశం చేసుకున్నారు. ఉత్తమ రచనగా రాత నాటిక రచయిత పోలదాసు శ్రీనివాసరావు బహుమతులు అందుకున్నారు. అలాగే క్యారెక్టర్ నటుడిగా చిగురు మేఘం నాటికలో చిన్నయ్య పాత్రదారి కావూరి సత్యనారాయణ, హాస్య నటునిగా పక్కింటి మొగుడు నాటికలో సీతాపతి పాత్రదారి యు.వి.శేషయ్య, ఉత్తమ బాలనటిగా రాత నాటికలో స్వప్నిక పాత్రదారి సురభి వాగ్దేవి, ఉత్తమ మేకప్ శ్రీఉమా ఆర్ట్ కికొకని (తితిక్ష), రంగాలంకరణ టి. బాబురావు (తితిక్ష), ఉత్తమ సంగీతం కె.వి.రమణ (పక్కింటి మొగుడు), ప్రత్యేక జ్యూరీ బహుమతి రాత నాటిక బహుమతులు సాధించారు. ఈ ఏడాది రంగస్థలి ప్రతిభా పురస్కారాన్ని నాటక రచయిత, నటుడు, దర్శకుడు చలసాని కృష్ణప్రసాద్‌కు అందజేశారు. కార్యక్రమాలను రంగస్థలి అధ్యక్షుడు షేక్‌మహబూబ్‌సుభానీ, గౌరవాధ్యక్షుడు కె.వెంకటరావు, ప్రధాన కార్యదర్శి ఎన్.రామచంద్ర బోస్, కోశాధికారి కనపర్తి సూరిబాబు, ఏఏ మధుకుమార్, పి శ్రీనివాసాచార్యులు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment