విజ్ఞాన్‌లో డ్రోన్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం
చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో డ్రోన్ టెక్నాలజీ సెంటర్(సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ అటానమస్ సిస్టమ్స్)ను హైదరాబాద్‌లోని ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.విద్యాసాగర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ సెంటర్ వలన విద్యార్థులకు డ్రోన్‌్ డిజైన్, ప్రోగ్రామింగ్, డ్రోన్ల వినియోగంపై శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. టెక్నాలజీలో హ్యాండ్స్– ఆ అనుభవం కల్పించేందుకు ల్యాబ్ సౌకర్యాలు, విద్యాపరమైన కోర్సులు, వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీ, ఆటోనమస్ నావిగేషన్, రిమోట్ సెన్సింగ్‌పై ప్రత్యేక కోర్సులను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. విద్యార్థులకు పరిశ్రమ నిపుణులతో వర్క్‌షాప్‌లు, సెమినార్లు, అతిథి ఉపన్యాస కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు కొత్త డ్రోన్ ఆధారిత స్టార్టప్‌లను ప్రారంభించేందుకు మద్దతు అందిస్తామని వివరించారు. పరిశ్రమలతో కలిసి కొత్త డ్రోన్‌న్ సొల్యూషన్‌న్ల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. డ్రోన్‌న్‌టెక్నాలజీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో సహకారానికి తోడ్పాటుపడతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. డ్రోన్‌న్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామింగ్‌పై పోటీలు నిర్వహించడం, డ్రోన్‌పై పై కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. వైస్ చాన్‌న్సలర్ పి.నాగభూషణ్ మాట్లాడుతూ ఈ డ్రోన్ టెక్నాలజీ సెంటర్‌ను హైదరాబాద్‌లోని ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్ ప్రై వేట్ లిమిటెడ్ మరియు విజ్ఞాన్ యూనివర్సిటీల సంయుక్త ఆర్థిక సౌజన్యంతో ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎంఎస్ రఘునాథన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment