రీసర్వే పైలెట్ ప్రాజెక్ట్ పనులు తనిఖీ
లక్ష్మీపురం: గుంటూరు తూర్పు మండలం, జొన్నలగడ్డ గ్రామంలో భూ రీసర్వే పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన పనులను జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ సోమవారం తనిఖీ చేశారు. రీ సర్వే బ్లాక్ బౌండరీ సరిహద్దులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
నీతి ఆయోగ్ బృందం తక్కెళ్లపాడు సందర్శన
పెదకాకాని: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల సద్వినియోగంపై నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం తక్కెళ్లపాడు పంచాయతీ కార్యాలయాన్ని సోమవారం సందర్శించింది. బృందం సభ్యులు జిష్యుపాల్, స్వప్నలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, సడక్ యోజన, పింఛన్ పంపిణీ, డ్వాక్రా యానిమేటర్లతో మాట్లాడారు. డ్వాక్రా స్వయం సహాయ సంఘాలకు మంజూరు చేసిన నిధుల సద్వినియోగంపై డ్వాక్రా సంఘాల మహిళలతో చర్చించారు. ఈ పథకాలను సంబంధించిన పలు రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్.శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
రీసర్వే పైలెట్ ప్రాజెక్ట్ పనులు తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment