‘మచ్చు’కై నా దయలేదు!
అసలే సరైన ధర లేక అల్లాడుతున్న రైతులపై అధికారులు మచ్చుకైనా దయ చూపడం లేదు. మిర్చి యార్డులో మచ్చుకాయల దోపిడీని అరికట్టలేక చోద్యం చూస్తున్నారు. మరో వైపు వేమెన్స్ లేకుండానే దిగుమతి వ్యాపారుల గుమాస్తాలు కాటాలు వేస్తూ తూకంలో మోసం చేస్తున్నారు. ఆ తర్వాత వేమెన్లు వచ్చి బిల్లులు ఇస్తున్నారు. దిగుమతి వ్యాపారులు కమీషన్ పేరుతోనూ దండుకుంటున్నారు. వాస్తవానికి రెండుశాతం కమీషన్ తీసుకోవాల్సి ఉండగా, కొందరు నాలుగు నుంచి ఆరు శాతం వసూలు చేస్తున్నారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment