కేంద్ర పథకాల అమలు తీరుపై ఆరా
శావల్యాపురం: మండలంలోని శానంపూడి గ్రామంలో కేంద్ర టీం సభ్యులు పర్యటించి కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలు పొందుతున్న లబ్థిదారులను మంగళవారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామసచివాలయంలో ఏర్పాటు చేసిన సదస్సులో న్యూఢిల్లీ సంబోధ రీసెర్చ్ కమ్యూనికేషన్స్ ఫీల్డ్ మేనేజరు అండ్ కోఆర్డినేటరు వికాస్ మల్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రధానమంత్రి అవాస్ యోజన, స్వయ సహాయక సంఘూలు, పింఛన్లు పంపిణీ, గ్రామీణ సడక్ యోజన, గ్రామ స్వరాజ్య అభియాన్ తదితర పథకాల పురోగతిపై లబ్థిదారులను అడిగి తెలుసుకున్నారు. పథకాల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులున్నాయా, అర్హులకు అందుతున్నాయా తదితరవన్నీ క్షేత్రస్థాయిలో లబ్థిదారులతో మాట్లా డారు. అనంతరం గ్రామంలో పర్యటించి ఆవాస్ యోజన పఽథకంలో నిర్మించిన నివాస గృహాలను పరిశీలించి లబ్థిదారులతో మాట్లాడి బిల్లులు గురించి ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment