అమరావతి: పుణ్యక్షేత్రమైన అమరావతి శ్రీ మాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి శివరాత్రి బ్రహ్మోత్సవాల సమన్వయ కమిటీ మూడో సమావేశం ఈ నెల 25వ తేదీన జరగనుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్ ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సత్తెనపల్లి ఆర్‌డీవో రమణకాంతరెడ్డి ఆధ్వర్యంలో ఆ రోజు మధా్‌య్‌హ్నం 2 గంటలకు ఆలయ ప్రాంగణంలో సమావేశం ఉంటుందని చెప్పారు.
పండ్లతోటల పెంపకంపై రాయితీ
నరసరావుపేట రూరల్: పండ్లతోటల పెంపకంపై ప్రభుత్వ రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డాట్ సెంటర్ శాస్త్రవేత్త నాగేష్ తెలిపారు. మండలంలోని పమిడిమర్రులో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్త నాగేష్, ఉద్యాన శాఖ అధికారి నవీన్‌కుమార్‌లు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతం మిర్చి ధర తక్కువగా ఉన్నందున రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వంద శాతం రాయితీలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్‌లో ఉద్యాన పంటలకు ఇచ్చే రాయితీని వచ్చే 2025–26 నుంచి పెంచినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment