వైభవంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
తెనాలి: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని శుక్రవారం స్థానిక కొత్తపేటలోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు మాచిరాజు రామకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. పట్టణానికి చెందిన కవి, రచయిత పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి, స్వరలయ సంస్థ వ్యవస్థాపకుడు సాయి లక్కరాజు తమ ప్రసంగాల్లో మాతృభాషా దినోత్సవం ప్రారంభం, విశిష్టత, ఆవశ్యకతను తెలియజేశారు. గాలి సత్యనారాయణ, పావులూరి శ్రీనివాసరావు, వేములపల్లి సుజన, పినపాటి రవికుమార్, నండూరి నారాయణరావు, యడవల్లి శ్రీనివాసచౌదరి, జల్లి గంటయ్యలు మాతృభాషా దినోత్సవం వైశిష్ట్యాన్ని వివరించారు. విశిష్ట అతిథులు పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి, సాయి లక్కరాజులు మాతృభాష ప్రచారానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా అసోసియేషన్ జిల్లా సహాయ కార్యదర్శి బేతాళ ప్రసాద్ చేతులమీదుగా సత్కరించారు. కోశాధికారి హృదయరాజు పర్యవేక్షించారు.
లూథరన్ ప్రాథమికోన్నత పాఠశాలలో...
అంతర్జాతీయ మాతభాష దినోత్సవాన్ని స్థానిక నాజర్‌పేటలోని లూథరన్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మునిపల్లి వెంకట రఘునాథరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కవి, రచయిత, కళాకారుడు లక్కరాజు లక్ష్మణరావు మాట్లాడుతూ మాతృభాష మాధుర్యాన్ని, భాషావశ్యతకను వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని పి.ప్రియదర్శిని, ఉపాధ్యాయుడు ఎం.వెంకటరెడ్డి ప్రసంగించారు. పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వేమన శతక పద్యాల పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలను అందజేశారు. తొలుత తెలుగుతల్లి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
Comments
Please login to add a commentAdd a comment