రేపు ఎయిమ్స్‌లో వాక్‌థాన్
మంగళగిరి: నగర పరిధిలోని ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఎయిమ్స్) ఆవరణలో వాక్‌థాన్ నిర్వాహకులు వి.నేహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 13న గురువారం ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు వాక్‌థాన్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఎయిమ్స్ ఆవరణలోని ఆడిటోరియంలో నిర్వహించే సమావేశంలో కిడ్నీ ప్రాముఖ్యంపై అవగాహన కల్పించనున్నట్టు వివరించారు.
సాగర్ నీరు సాగు, తాగుకే వాడుకోవాలి
నరసరావుపేట: నాగార్జునసాగర్ కుడికాలువకు కృష్ణా బోర్డు కేటాయించిన నీటిలో మిగిలిన నీరు మార్చి చివరి వరకు మాత్రమే సరిపోయే అవకాశం ఉన్నందున వృథా చేయకుండా పంట పొలాలు, తాగునీటి చెరువులకు మాత్రమే ఉపయోగించాలని ఎన్‌ఎస్పీ సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణమోహన్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మే నెలలో తాగునీటి చెరువుల కోసం నీరు విడుదల చేసేంత వరకు కాలువలు మూసివేయనున్నట్టు చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా విభాగం, ప్రజారోగ్యశాఖల అధికారులు తాగునీటి చెరువుల్లోని నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరారు.
రేపు సత్రశాలలో 16 రోజుల పండుగ
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద వేంచేసిన శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో గురువారం 16 రోజుల పండగ నిర్వహించనున్నట్లు ఈఓ గాదె రామిరెడ్డి మంగళవారం తెలిపారు. మహాశివరాత్రి పండగ వెళ్లిన 16 రోజుల తరువాత దేవస్థానంలో స్వామివార్ల కల్యాణం నిర్వహించి అనంతరం కనులపండువగా వసంతోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తున్నట్లు వివరించారు.
వలస పక్షుల రాక
పెదకూరపాడు : కొల్లేరు ప్రాంతానికి విదేశీ పక్షులు రావడం అందరికీ తెలిసిన విషయమే. గుంటూరు జిల్లాలోనూ తక్కెళ్లపాడు చెరువుకు వలస పక్షులు రావడం సహజం. ఈ కోవలోనే పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరు గ్రామంలోని చెరువు కూడా వలస పక్షులకు ఆవాసంగా మారడంతో ప్రజలు పక్షులను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు గట్లపైన పండ్ల మొక్కలు నాటి సంరక్షిస్తే పక్షులకు ఆవాసాలుగా మారతాయని, తద్వారా జీవవైవిధ్యాన్ని కాపాడవచ్చని పక్షి ప్రేమికులు కోరుతున్నారు.
యార్డులో 1,44,323 బస్తాలు మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 1,38,953 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,44,323 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది.
రేపు ఎయిమ్స్‌లో వాక్‌థాన్
రేపు ఎయిమ్స్‌లో వాక్‌థాన్
Comments
Please login to add a commentAdd a comment