11 మందికి ఎస్‌ఐలుగా, నలుగురికి ఏఎస్‌ఐలుగా ఉద్యోగోన్నతి
నగరంపాలెం: ప్రతిఒక్కరూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపా ఠి అన్నారు. రేంజ్ పరిధిలోని పలు జిల్లాలకు చెందిన 11 మంది ఏఎస్‌ఐ (సివిల్)లకు ఎస్‌ఐ (సివిల్)లుగా, నలుగురు హెడ్ కానిస్టేబుళ్ల (ఏఆర్)కు ఏఎస్‌ఐ (ఏఆర్)లుగా ఉద్యోగోన్నతి కల్పించి, జిల్లాలు కేటాయించారు. ఈ మేరకు ఉద్యోగోన్నతి పొందిన ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు మంగళవారం గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్డులోని ఐజీ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు.
● ఎస్‌ఐలు ఎన్.శ్రీనివాసరెడ్డి తిరుపతి జిల్లాకు, వీఎన్ మల్లేశ్వరరావు, పి.ప్రమీల, ఆర్.కొండయ్య, డి.రాజ్యం, డి.శ్రీనివాసరావు, పి.సుబ్బారావు, బీ.శ్రీనివాసరావు, వై.రాజులు, ఎండి.అబ్దుల్‌హఫీజ్, షేక్.ఎన్.రసూల్‌ను గుంటూరు జిల్లాకు, ఏఆర్ ఏఎస్‌ఐలు పి.మోహన్‌రావు శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లా, షేక్.మస్తాన్, కె.శీను తిరుపతి జిల్లాకు, కె.శివకుమార్‌ను పల్నాడు జిల్లాకు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment