యూత్ పార్లమెంట్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
గుంటూరు ఎడ్యుకేషన్: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి యూత్ పార్లమెంటు పోటీలను టీజేపీఎస్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు టీజేపీఎస్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లాస్థాయి యూత్ పార్లమెంటు చైర్‌పర్సన్ డాక్టర్ ఎస్.అనితాదేవి తెలిపారు. మంగళవారం పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాలలో ఆమె మీడియాతో మాట్లాడారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్‌లో భాగంగా నిర్వహిస్తున్న యూత్ పార్లమెంట్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. యూత్ పార్లమెంటు నమోదుకు ఈనెల 16వ తేదీవరకు గడువు పొడిగించినట్లు చెప్పారు. జిల్లాస్థాయి యూత్ పార్లమెంట్ నోడల్ అధికారి డాక్టర్ జేవీ సుధీర్‌కుమార్ గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని విద్యార్థులకు గుంటూరు కేంద్రంగా పోటీలు జరగనున్నాయని తెలిపారు. 18 నుంచి 25 ఏళ్ల లోపు వయసు గల యువత పోటీల్లో పాల్గొనవచ్చునని వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ‘మై భారత్ పోర్టల్’ లో రిజిస్టర్ చేసుకుని, ఒక నిముషం నిడివి కలిగిన ‘వాట్ డస్ వికసిత్ భారత్ మీన్ టు యూ‘ అనే అంశంపై వీడియో చేసి, మై భారత్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. స్క్రీనింగ్‌లో ఎంపికై న వారికి జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీలు ఉంటాయని అన్నారు.
ఈనెల 16వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
జిల్లాస్థాయి యూత్ పార్లమెంటు
చైర్‌పర్సన్ అనితాదేవి
Comments
Please login to add a commentAdd a comment