ధర్మవరం వెళ్లే రైళ్లు తాత్కాలికంగా రద్దు
లక్ష్మీపురం: సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ మీదుగా ధర్మవరం రైల్వేస్టేషన్‌కు వెళ్లాల్సిన రైళ్లు ధర్మవరం స్టేషన్ ప్లాట్ ఫారం 5లో పలు అభివృధ్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో అనంతరపురం వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ తెలిపారు. రైలు నంబర్ 17215 మచిలీపట్నం–ధర్మవరం రైలు ఈనెల 12 నుంచి 30వ తేదీ వరకు మచలిపట్నం స్టేషన్ నుంచి బయలుదేరి అనంతపురం స్టేషన్ వరకు మాత్రమే ప్రయాణిస్తుందని తెలిపారు. రైలు నంబర్ 17216 ధర్మవరం–మచిలీపట్నం రైలు ఈనెల 13వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అనంతపురం నుంచి మచిలీపట్నం వరకు మాత్రమే నడుస్తుందన్నారు. ప్రయాణికులు అసౌకర్యాన్ని గమనించి సహకరించాల్సిందిగా కోరారు.
బ్యాంక్ ఉద్యోగుల నిరసన
కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించతలపెట్టిన రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యూఎఫ్‌బీయూ) పిలుపునిచ్చింది. ఈ మేరకు వివిధ బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు మంగళవారం తమ తమ బ్యాంకుల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంపాలెంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ వి.నరేంద్ర కుమార్ మాట్లాడుతూ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల్లోని అన్ని విభాగాల్లో తగిన రిక్రూట్‌మెంట్ చేపట్టాలని, వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వర్క్‌మెన్, ఆఫీసర్ డైరెక్టర్ల పోస్టుల భర్తీకి కూడా యూఎఫ్‌బీయూ డిమాండ్ చేస్తోందన్నారు. కార్యక్రమంలో వివిధ బ్యాంకుల యూనియన్ల నాయకులు పీఎస్ రంగసాయి, షేక్ ఇబ్రహీం, పి.కిషోర్, సయ్యద్ బాషా, సునీత, కళ్యాణ్, రాంబాబు, సాంబశివరావు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణానదిలో గుర్తుతెలియని మృతదేహం
తాడేపల్లిరూరల్: ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది దిగువ ప్రాంతంలో గేటు వద్ద మృతదేహం ఉన్నట్లు మంగళవారం తాడేపల్లి పోలీసులకు మత్స్యకారులు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కృష్ణానది దిగువ ప్రాంతంలోని 4వ నెంబరు గేటు వద్ద మృతదేహాన్ని బయటకు తీయించి పరిశీలించారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 35–40 మధ్య ఉండవచ్చని, మృతుడి ఒంటిపై ఎర్రచొక్క నల్లగీతలు, బ్లాక్ జీన్స్‌ఫాంట్ ధరించి ఉన్నాడని, కుడిచేతికి కాశీదారం ఉందని, మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిందని, మృతదేహాన్ని గుర్తిస్తే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు.
ధర్మవరం వెళ్లే రైళ్లు తాత్కాలికంగా రద్దు
ధర్మవరం వెళ్లే రైళ్లు తాత్కాలికంగా రద్దు
Comments
Please login to add a commentAdd a comment