విద్యార్థుల భవిత కోసం నేడు పోరుబాట
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశానుసారం విద్యార్థుల భవిష్యత్ కోసం, వారి పక్షాన వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. బుధవారం జరగనున్న యువత పోరులో విద్యార్థులు, తల్లిదండ్రులు, యువజనులు భాగస్వాములవ్వాలని, కూటమి సర్కారుకు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గుంటూరు నగరంలో యువత పోరు ఏర్పాట్లను మంగళవారం ఆయన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంటరీ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు(డైమండ్ బాబు)తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామి థియేటర్ వద్ద వారు మాట్లాడుతూ బుధవారం ఉదయం 9.30 గంటలకు పట్టాభిపురంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం నుంచి ర్యాలీ మొదలవుతుందని, కలెక్టరేట్ వరకు జరుగుతుందని వివరించారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య, మాజీ మిర్చి యార్డ్ ఛైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కొరిటెపాటి ప్రేమ్‌కుమార్, పార్టీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు వినోద్‌కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు యువత పోరుకు ఏర్పాట్లు పూర్తి పరిశీలించిన వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలు
Comments
Please login to add a commentAdd a comment