హంస వాహనంపై నారసింహుడు
లక్ష్మీనృసింహస్వామి బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేతుడైన నారసింహుడు మంగళవారం ఉదయం హంస వాహంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి ప్రసాదాలు స్వీకరించారు. కై ంకర్యపరులుగా వేదాంత వెంకట రమణాచార్యులు భార్య గోపాల సత్యవతి, కుమారులు వేణుగోపాల వాసుదేవభట్టర్,అరుణప్రియ, సోదరులు వ్యవహరించారు. మంగళవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు గజవాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. కై ంకర్యపరులుగా పాత మంగళగిరి శ్రీ పద్మశాలీయ సంఘం వారు వ్యవహరించారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ ఎ.రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. అత్యంత విశిష్టత కలిగిన పొన్నవాహన సేవ బుధవారం రాత్రి జరుగుతుందని ఈఓ రామకోటిరెడ్డి తెలిపారు.
– మంగళగిరి/మంగళగిరి టౌన్
Comments
Please login to add a commentAdd a comment