కోనేటి రాయుడికి నీరాజనాలు
రాజుపాలెం: పల్నాడు తిరుపతిగా పేరుగాంచిన దేవరంపాడు కొండపై స్వయంభూగా వెలసిన నేతి వెంకన్నస్వామి మూడవ శనివారం తిరుణాళ్లకు భక్తులు పోటెత్తారు. సమీప ప్రాంతాల నుంచే గాక సుదూర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు దేవరంపాడు కొండకు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకునే సమయంలో గోవింద నామస్మరణతో కొండ మారుమోగింది. కోనేటి రాయుడికి కోటి దండాలంటు నీరాజనాలు అందించారు. భక్తులు స్వామివారికి పొంగళ్లుచేసి నెయ్యి, బెల్లం, పప్పు వగైరాలు సమర్పించారు. పశుసంపద ను కాపాడాలని నెయ్యిని సమర్పించి మొక్కుకున్నా రు. తిరునాళ్లలో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం ఈఓ గణసతి సురేష్ ఏర్పాట్లు పరిశీలించారు. హుండీలు, విరాళాలు, స్పెషల్, సీఘ్ర దర్శ నాలు, తల నీలాలు, లడ్డు, ప్రసాదాల ద్వారా రూ 13,47,259లు ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment