సావిత్రీబాయి పూలే పుస్తకావిష్కరణ
పొన్నూరు: పట్టణంలోని లుంబినీ వనం అంబేడ్కర్ రీసెర్చ్ సెంటరులో కవి డాక్టర్ కత్తి పద్మారావు రచించిన ‘సావిత్రీబాయి పూలే’ పుస్తకాన్ని అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్ గుంటూరు జిల్లా కన్వీనర్ పిల్లి సుజాత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సావిత్రీబాయి పూలే జీవిత కథను పుస్తక రూపంలో ప్రపంచానికి తెలియ చేసిన డాక్టర్ కత్తి పద్మారావును అభినందించారు. భారతదేశంలో ప్రత్యామ్నాయ జీవన వ్యవస్థలు వెలిగించిన ఒక మహోజ్వల కాంతి దీపం సావిత్రీబాయి పూలే అని పేర్కొన్నారు. ఆ మహనీయురాలి పుస్తకాన్ని ప్రతి మహిళ చెంతకు చేరుస్తానని తెలిపారు. అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్ గుంటూరు జిల్లా కన్వీనర్‌గా సమర్థంగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుజాతను పద్మారావు సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment