అభివృద్ధి, సాంకేతికతను రైతుల చెంతకు చేర్చాలి
చేబ్రోలు: పరిశోధనల్లో అభివృద్ధి, సాంకేతికతను రైతుల వద్దకు తీసుకెళ్లాలని న్యూఢిల్లీలోని ఐకార్ – ఐఏఆర్‌ఐ (ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) డైరెక్టర్, వైస్ చాన్స్‌లర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘‘అకడమియా ఇండస్ట్రీ ఫార్మర్ పార్టనర్‌షిప్స్ కాన్‌క్లేవ్’’ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజ్ఞాన్ యూనివర్సిటీ– ఐఐఓపీఆర్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్)ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సంబంధిత పత్రాలను వైస్ చాన్స్‌లర్ పి. నాగభూషణ్ పెదవేగిలోని ఐఐఓపీఆర్ డైరెక్టర్ డాక్టర్ కె.సురేష్‌కు అందజేశారు. కార్యక్రమానికి అనేక విద్యా సంస్థల ప్రతినిధులు, పరిశ్రమల ప్రముఖులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన చెరుకుమల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు తగ్గ వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని తెలిపారు. అకడెమియా–ఇండస్ట్రీ–ఫార్మర్ మధ్య సహకారాన్ని బలపరచాలని సూచించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి సాంకేతికత, పరిశోధన, పరిశ్రమలతో పాటు రైతుల మధ్య భాగస్వామ్యం కీలకమని చెప్పారు. రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు వ్యవసాయంలో ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ, టెక్నాలజీ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సంగం సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆలపాటి సత్యనారాయణ, హైదరాబాద్‌లోని ఐఐఎంఆర్ డైరెక్టర్ సి.తారా సత్యవతి, రాజమండ్రిలోని సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ మాగంటి శేషు మాధవ్, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.
న్యూఢిల్లీలోని ఐకార్ – ఐఏఆర్‌ఐ డైరెక్టర్, వైస్ చాన్స్‌లర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు
విజ్ఞాన్– ఐఐఓపీఆర్ మధ్య
అవగాహన ఒప్పందం
Comments
Please login to add a commentAdd a comment