స్వచ్ఛాంధ్ర నిర్మాణానికి పాటుపడాలి
జిల్లా పంచాయతీ అధికారి బి.వి.సాయికుమార్
పొన్నెకల్లు(తాడికొండ): స్వచ్ఛాంధ్ర నిర్మాణం కోసం అందరూ పాటు పడాలని గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి బీవీ సాయికుమార్ తెలిపారు. తాడికొండ మండలం పొన్నెకల్లు పంచాయతీ కార్యాలయంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎల్‌పీవో మాట్లాడుతూ ప్రకృతి కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని తెలిపారు. స్వచ్ఛతను పాటించడం ద్వారా స్వచ్ఛ గ్రామాలను నిర్మించుకోవచ్చని చెప్పారు. అనంతరం చెరువు గట్టుపై మొక్కలు నాటారు. ర్యాలీ నిర్వహించి గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. గ్రామస్తులకు తడిచెత్త, పొడిచెత్త డబ్బాలు, మిత్రాలకు ఆఫ్రాన్, గ్లౌజులు అందజేశారు. కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి కె. శ్రీనివాసరావు, తహసీల్దార్ పి. మెహర్ కుమార్, ఈవోపీఆర్డీ కె. సాయిలీల, కార్యదర్శి షేక్ మహమ్మద్ జాని, సిబ్బంది, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment