23న దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

23న దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్ష

Published Wed, Mar 19 2025 2:12 AM | Last Updated on Wed, Mar 19 2025 2:10 AM

23న దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్ష

23న దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్ష

ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున విద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో 2025 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ), మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (ఎంసీఏ) కోర్సుల్లో ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ మంగళవారం విడుదల చేసినట్లు దూరవిద్య కేంద్రం డైరెక్టర్‌ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు ప్రవేశ పరీక్ష వివరాలను వివరించారు. ఈనెల 23న ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఏడు పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని చెప్పారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు చేయని అభ్యర్థులు నేరుగా టెన్త్‌ క్లాస్‌, డిగ్రీ ప్రొవిజినల్‌, మార్కుల జాబితా అభ్యర్థి ఫొటోతోపాటు సాధారణ ఫీజు రూ.500 చెల్లించి, పరీక్ష జరిగే 23న నేరుగా హాజరు కావచన్నారు. సంబంధిత ప్రవేశ పరీక్ష ఫలితాలును ఈనెల 25 సాయంత్రం విడుదల చేస్తామని చెప్పారు.

ప్రవేశ పరీక్ష కేంద్రాలు

సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు), ఆదిత్య డిగ్రీ కాలేజ్‌ (కాకినాడ), ఎం ఎస్‌ ఆర్‌ ఎస్‌ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్‌ (విశాఖపట్నం), గీతం డిగ్రీ కాలేజ్‌ (ఒంగోలు), గేట్‌ డిగ్రీ కాలేజ్‌ (తిరుపతి), శ్రీ విజయ దుర్గ డిగ్రీ కాలేజ్‌ (కర్నూలు), శ్రీ సాయి డిగ్రీ కాలేజ్‌ (అనంతపూర్‌) మొత్తం ఏడు పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు.ఏపీ ఐసెట్‌ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఈ కోర్సుల్లో అడ్మిషన్‌లు పొందవచ్చు. ప్రత్యేకంగా ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.

అర్హతలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీస విద్యార్హతలు కలిగి ఉండాలి. రెండేళ్ల వ్యవధి ఎంబీఏ జనరల్‌ కోర్సులకు ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ కలిగి ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డిగ్రీలో 45 శాతం, మిగిలిన వారు 50 శాతం ఉత్తీర్ణత శాతం కలిగి ఉండాలని సూచించారు.

ఎంబీఏలో రెండు స్పెషలైజేషన్స్‌

ఎంబీఏ జనరల్‌లో ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్మెంట్‌, బ్యాంకింగ్‌ ఇన్సూరెన్స్‌ మేనేజ్మెంట్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ట్రావెల్‌ టూరిజం మేనేజ్మెంట్‌, బిజినెస్‌ ఎనాలిటిక్స్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మేనేజ్మెంట్‌ మొత్తం 8 స్పెషలైజేషన్స్‌ ఉన్నాయి. అందులో రెండిటిని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

– ఎంసీఏ కోర్సులకు పది తర్వాత ఇంటర్‌, డిగ్రీ లేదా ఇంజనీరింగ్‌, డిప్లొమా తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంసిఏ కోర్సులకు డిగ్రీలో తప్పనిసరిగా మ్యాథ్స్‌ చదివి ఉండాలి. దూర విద్యలో మ్యాథ్స్‌ డిగ్రీ చదివిన వారిని కూడా అర్హులుగా గుర్తిస్తారు. డిగ్రీలో మ్యాథ్స్‌ చదవని విద్యార్థులు ఇంటర్‌లోనైనా మ్యాథ్స్‌ సబ్జెక్టును చదివి ఉండాలి అని వెల్లడించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వర్సిటీ వైబ్సెట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఏఎన్‌యూసీడీఈ.ఇన్‌ఫో నుంచి హాల్‌ టికెట్లను, ర్యాంక్‌ కార్డులు పొందవచ్చు అన్నారు. మరిన్ని వివరాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్య కేంద్రం ఏఎన్‌యూసీడీఈ.ఇన్‌ఫో అధికారిక వైబ్సెట్‌ నుండి, ఫోన్‌ నంబర్స్‌ – 9848477441, 0863–2346323 సంప్రదించవచ్చుని డైరెక్టర్‌ చార్య వెంకటేశ్వర్లు తెలిపారు.

దరఖాస్తు చేయకున్నా సాధారణ ఫీజు రూ.500తో అదే రోజు పరీక్ష హాజరు కావచ్చు

రాష్ట్రవ్యాప్తంగా ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

ఏపీ ఐసెట్‌ ర్యాంకర్లు నేరుగా ప్రవేశాలు పొందవచ్చు

దూరవిద్య కేంద్రం డైరెక్టర్‌ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement