చలపతి ఎడ్యుకేషన్ సొసైటీ 30 ఏళ్ల మహోత్సవం
మోతడక(తాడికొండ): చలపతి ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించి 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ నెల 12–22 వరకు తమ అన్ని బ్రాంచిలలో 4 రోజుల పాటు చలపతి మహోత్సవం పేరిట సంబరాలు నిర్వహిస్తున్నట్లు చలపతి విద్యా సంస్థల ఛైర్మన్ వైవీ ఆంజనేయులు తెలిపారు. మంగళవారం మోతడక చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో పలువురు ప్రిన్సిపల్స్, అధ్యాపకులతో కలిసి ఆయన పోస్టరు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చలపతి మహోత్సవంలో భాగంగా ఈ నెల 19న ఐడియాథాన్, 20న వివిధ అంశాలలో సాంకేతిక పరమైన పోటీలు 21–22 తేదీలలో క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని సదావకాశం ఉపయోగించుకొని తమ ప్రతిభ నిరూపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కార్యదర్శి వై సుజిత్ కుమార్, డైరెక్టర్‌లు డి వినయ్ కుమార్, కె శ్రీనివాసరెడ్డి, జి సుబ్బారావు, ప్రిన్సిపల్స్ డాక్టర్ కె నాగ శ్రీనివాసరావు, డాక్టర్ ఎం చంద్రశేఖర్, అకడమిక్ డీన్‌లు, వివిధ శాఖాఽధిపతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment