నగరంపాలెం(గుంటూరు వెస్ట్): స్థానిక బ్రాడిపేటలోని కథా రచయిత్రి తాటికోల పద్మావతి నివాసంలో గుంటూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కవులందరూ కలిసి ‘కవిత్వంతో కాసేపు’ నిర్వహించారు. ఈనెల 21 న అంతర్జాతీయ కవితా దినోత్సవం, 30న ఉగాది పండుగ సందర్భంగా కవిత్వంపై చర్చించారు. ఔత్సాహిక కవులను ప్రోత్సహించడమే లక్ష్యంగా సంఘం పని చేద్దామని సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం.సుభాని తెలిపారు. కవులు తాము రాసిన కవితతోపాటు సమకాలీన కవులు రాసిన, తమకు నచ్చిన మరో కవిత వినిపించి జయప్రదం చేశారని కోశాధికారి నానా చెప్పారు. రచయిత్రి తాటికోల పద్మావతి ఆతిథ్యం, ఆప్యాయతలను కవులు కొనియాడారు. సంఘం ఉపాధ్యక్షులు బొమ్ము ఉమామహేశ్వరరెడ్డి, సభ్యులు ఈవూరి వెంకట రెడ్డి, కొణతం నాగేశ్వరరావు, శ్రీవశిష్ట సోమేపల్లి పాల్గొన్నారు.